8 మంది బీజేపీ ఎమ్మెల్యేల తీరుతో..తలపట్టుకుంటున్న జనాలు ?
8 మంది ఎమ్మెల్యేలది ఒక్కొక్కరిది ఒక్కో డిఫరెంట్ స్టైల్. రాజాసింగ్ హిందుత్వ ఎజెండా తప్ప మిగతా అంశాలు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన జెయింట్ కిల్లర్ కాటిపల్లి వెంకట్రమణారెడ్డి రూటే సెపరేట్ అన్నట్టుగా ఉంది. ముత్తూల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ లోప్రొఫైల్. వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటారు వారిద్దరూ.
ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానని బాధపడుతున్నానని ఆన్ రికార్డ్ కామెంట్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్ లో కామారెడ్డి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసిన తీరు చర్చకు దారితీసింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రాజకీయాలకు తాను అన్ఫిట్ అని చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా అడగను అంటూ ఆఫ్ ద రికార్డ్ కామెంట్ చేశారు.
ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని విడగొట్టి మాట్లాడుతూ.... వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు పై డి రాకేష్ రెడ్డి. ఎప్పటి కైనా తెలంగాణకు హోం మినిస్టర్ అవుతానంటూ మరో డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బీజేపీలోని మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉన్నా కాటిపల్లి, పైడి కామెంట్స్ పై పార్టీలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 8 ఎమ్మెల్యేలలను గెలుచుకోవడం జరిగింది.