పెద్దిరెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కురుక్షేత్ర యుద్ధం లాగానే కొనసాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమి తర్వాత.. ఏపీ రాజకీయాలు మరింత వేడిగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ అందరిలోనూ ఉంది. ముఖ్యంగా... జగన్మోహన్ రెడ్డి పాలనలో తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిన వారిని టార్గెట్ చేస్తున్నారు కూటమి సభ్యులు. గత ఐదు సంవత్సరాల కాలంలో జనసేన అలాగే టిడిపి నేతలను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

 

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా ఇబ్బందులు పడింది. కార్యకర్తలు ఆ పార్టీని నిలబెట్టుకున్నారు. అయితే ఇప్పుడు... జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నాన ప్రయత్నాలు చేయడం జరుగుతోంది.  ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాత్రం గట్టిగానే టార్గెట్ చేసింది టిడిపి ప్రభుత్వం. ఆయనపై అక్రమంగా కేసులు బనాయించి మరి ఇబ్బందులు పెడుతున్నారు. అయితే తాజాగా ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.

 

త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై అనార్హత వేటు పడుతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు ఇదే సంకేతాన్ని తెలుపుతున్నాయి. పెద్దిరెడ్డి తన ఎన్నికల అఫిడవిట్  లో  ఆస్తుల వివరాలను తప్పుగా ప్రచురించారట. తప్పుడు ఆస్తులను ఎన్నికల అధికారులకు ఇచ్చారట. అయితే దీనిపై తాజాగా అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని వేశారు.

 

ఆయన ఎవరో కారు రాజకీయ నేత రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అలాగే రామచంద్ర యాదవ్ మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయనే పిటిషన్ దాఖలు చేశారట. అయితే దీనిపై కోర్టు మంగళవారం రోజున విచారణ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. రామచంద్ర రెడ్డి నిజంగానే తప్పుడు అఫిడవిట్ ఇస్తే... ఎమ్మెల్యే పదవికి పోవడం గ్యారెంటీ. అయితే ఇది అంత తొందరగా జరిగే పని కాదు. కింది కోర్టులో షాక్ తగిలితే  నేరుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళవచ్చు. అప్పటివరకు ఐదు సంవత్సరాల పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవి కాలం కూడా పూర్తయ్య ఛాన్స్ ఉంది. మరి దీనిపై ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: