పడి లేచిన కెరటం కొండా సురేఖ.. ఇబ్బందులను అధిగమించి లక్ష్యాలను సాధించారుగా!

Reddy P Rajasekhar
తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి అవగాహన ఉన్నవాళ్లకు కొండా సురేఖ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. 1995 సంవత్సరంలో కొండా సురేఖ పొలిటికల్ కెరీర్ మొదలు కాగా వంచనగిరి ఎంపీటీసీగా గెలిచిన ఆమె ఆ తర్వాత గీసుగొండ మండల ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1996 సంవత్సరంలో ఆమె ఏపీ పీసీసీ సభ్యురాలిగా నియమింపబడ్డారు.
 
1999 సంవత్సరంలో కొండా సురేఖ శాయంపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 సంవత్సరంలో కొండా సురేఖ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కొండా సురేఖ పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసే గెలవగా ఆ సమయంలో ఆమెకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. 2009లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ పని చేశారు.
 
2011 సంవత్సరం జులై 4వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ పరకాల నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొండా సురేఖ టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరి తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 సంవత్సరంలో టీ.ఆర్.ఎస్ కు రాజీనామా చేసిన కొండా సురేఖ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
2018 ఎన్నికల్లో కొండా సురేఖ పరకాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గతేడాది ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె దేవాదాయ & అటవీ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించేలా కొండా సురేఖ రాజకీయాలు చేశారు. తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా కొండా సురేఖ గుర్తింపును సొంతం చేసుకోవడం కొసమెరుపు. రాజకీయాలలో కొండా సురేఖ పడి లేచిన కెరటం అని చాలామంది భావిస్తారు. తెలంగాణ రాజకీయాలలో మరికొన్ని సంవత్సరాల పాటు ఆమెకు తిరుగులేదని చెప్పవచ్చు. కొండా సురేఖ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కష్టపడి లక్ష్యాలను సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: