కేంద్ర బడ్జెట్: మిత్రపక్షాలు కోరిన కోర్కెలు తీర్చాల్సిందే ?

Veldandi Saikiran
* ఏపీకి ప్రత్యేక నిధులు, ప్రత్యేక సహాయం
* ఏపీకి మించి బీహార్ కు ఇవ్వాల్సిందేనని  నితీష్ పట్టు
* గుజరాత్ కంటే మిత్రపక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత
* సమానంగా నిధుల పంపకం  


ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్... చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇవాళ.. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం.  2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మల సీతారామన్. దీంతో అందరి దృష్టి...నిర్మల సీతారామన్ పెట్టే బడ్జెట్ పైనే ఉంది.
 అయితే ఇప్పటివరకు... 12 బడ్జెట్లను ప్రవేశపెట్టింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు పెట్టేది 13వ బడ్జెట్. అయితే ఈ 13వ బడ్జెట్ నేపథ్యంలో... మిత్రపక్షాలు.. భారీగానే డిమాండ్ చేస్తున్నాయి. 12 సార్లు బడ్జెట్ పెట్టినప్పుడు మోడీకి.. తిరుగులేదు. మొత్తం బిజెపి పార్టీ సొంతంగా అధికారంలో ఉండటంతో... ఎవరికి ఎంత బడ్జెట్ పెట్టినా... ఏ పార్టీ ప్రశ్నించలేదు.కానీ ఇప్పుడు అలా కాదు.

తెలుగుదేశం పార్టీ, బీహార్ కు చెందిన నితీష్ కుమార్ పార్టీ  లాంటి బలమైన పార్టీలు... తమ డిమాండ్స్ నెరవేర్చాల్సిందేనని...... లేకపోతే ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వమని ముందే చెప్పేస్తున్నాయి. దీంతో ఈ 13వ బడ్జెట్.. మోడీ ప్రభుత్వానికి కత్తి మీద సాములాగా తయారైంది. కచ్చితంగా తెలుగుదేశం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు... గతంలో కంటే ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉంది.ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. రాజధానికి, ప్రత్యేక ఆర్థిక సహాయం కింద భారీగానే నిధులు ఇవ్వాలి.
ఇక ఇటు... బీహార్ రాష్ట్రం కూడా ప్రత్యేక హోదా అడుగుతోంది. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేనందున.. ఏపీకి అలాగే బీహార్ కు సమానంగా నిధులు కేటాయించాలి. వీటితోపాటు... బిజెపికి సపోర్ట్ ఇచ్చిన పార్టీల రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కాకుండా ఎన్డీఏ ప్రభావం ఉన్న రాష్ట్రాలకు.. ఈసారి నిధులు భారీగా పెంచాల్సి ఉంటుంది. గతంలో లాగా బిజెపి ఉన్నచోట్ల..అంటే గుజరాత్ లాంటి ప్రాంతాలకే నిధులు కాకుండా... అందరికీ సమానంగా పంచాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: