పవన్ ఊసే ఎత్తని జగన్.. ఎందుకేంటి?

Suma Kallamadi

గడిచిన ఐదేళ్లు ఏపీ రాజకీయాలు ఎలా గడిచాయో అందరికీ తెలిసిందే. గత ఐదు సంవత్సరాలు ఏపీని పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఏ రకంగా విమర్శించిందో తెలియంది కాదు. మాజీ సీఎం జగన్ ఏనాడూ, పవన్ కళ్యాణ్ ని పేరు పెట్టి ఉచ్ఛరించింది లేదు.. సరికదా దత్త పుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ మాత్రమే సంబోధించి విమర్శించిన పరిస్థితి ఉండేది. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తనదైన మాటలతో జగన్ ప్రభుత్వాన్ని నిలదీసేవాడు.. అయితే జగన్ కి మల్లే అనేవాడు కాదు గానీ.. సీఎం క్యాడర్లో ఉన్న జగన్ మాత్రం ఏకవచనంతో మాట్లేడేవాడు.. కట్ చేస్తే, తాజా ఎన్నికలు పవన్ స్టామియాను తెలియజేశాయి.. దాంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
గతంలో ఒక్క సీటుకూడా గెలవని పవన్ తాజా ఎన్నికల్లో నిలబడిన 23 చోట్ల క్లీన్ స్వీప్ చేసి దేశ రాజకీయాల్లోనే రికార్డ్ సృష్టించాడు. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడి కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. అయితే 175 సీట్లకు 175 గెలుస్తామన్న వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం సొంత పార్టీ వర్గాలనే మింగుడు పడలేదు.. ఈ క్రమంలో వారి లోపాలు ఏమిటాని చూసుకున్నప్పుడు మాత్రం వారికి ముందుగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించాడు. తమ అన్న జగనన్న కేవలం పవన్ పైన ఫోకస్ పెట్టడం వల్లనే తాము అంత నష్టపోవాల్సి వచ్చిందని అభిప్రాయ పడిన పరిస్థితి..
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి నెలన్నర రోజులు కావస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ పరిస్థితుల్ని చూసుకుంటే హత్య రాజకీయాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయని విశ్లేషకులు మండి పడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్నే తాజా ప్రభుత్వం రిపీట్ చేస్తోందని అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జగన్ తాజాగా జరిగిన మర్డర్ ఘటనపైన కేవలం చంద్రబాబునే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారే తప్పితే జనసేనాని పవన్ ను ఆయన పల్లెత్తి మాట కూడా తినకపోవడం ఇపుడు చాలామందిని ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. ఎందుకంటే గతంలో ఆయనికి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. చేసుకున్న మూడు పెళ్లిళ్లకు నాలుగు పెళ్లిళ్లు అంటూ ప్రతి వేదిక మీదా ప్రస్తావించే జగన్మోహన్ రెడ్డి నేడు రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపట్ల కూడా పవన్ ని పల్లెత్తి మాట తినకపోవడం పట్ల ఏమిటి రహస్యం దాగి ఉందబ్బా? అని ఆలోచిస్తున్న పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: