అమెరికాలో సైతం రుణమాఫీ..కానీ రైతులకు కాదా...?

murali krishna
అమెరికాలో సైతం రుణమాఫీ..కానీ రైతులకు కాదా...?
* రెండు తెలుగు రాష్ట్రాలలో కీలకంగా మారిన రుణమాఫీ అంశం
 
* అమెరికాను సైతం ఊపేసిన రుణమాఫీ హామీ
 
* అమెరికా  పౌరులకు  జో బైడన్  బంపర్ ఆఫర్ ?

రుణమాఫీ ..రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడే ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది.2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించబడింది.ఇక అదే సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు రైతులు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.దీనితో ఆ ఎన్నికలలో టీడీపీ ఘనవిజయం సాధించింది.నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్య మంత్రిగా భాద్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు పరిచారు.కానీ ఈ హామీ అమలులో కొన్ని లోటు పట్లు జరగడంతో ప్రజలు తీవ్రంగా విమర్శించారు.చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరని ప్రతిపక్ష పార్టీ ప్రచారం చేసింది.దీనితో 2019 ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.అటు తెలంగాణాలో రుణమాఫీ హామీ ఇచ్చిన కెసిఆర్ ఆ హామీని సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు..దీనితో 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ ఓడిపోయింది.పదేళ్ల తరువాత మొదటి సరి కాంగ్రెస్ తెలంగాణాలో విజయం సాధించింది.సీఎంగా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చెల్లిస్తామని ప్రకటించారు.అందులో భాగంగానే రెండు విడతల్లో రుణ మాఫీ పధకాన్ని అమలు చేసారు.దీనిపై రాష్ట్ర రైతాంగం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.రుణమాఫీని ఛాలెంజింగ్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి కేవలం ఏడూ నెలలలోనే పూర్తి చేసి చూపించారు.
ఇదిలా ఉంటే రుణమాఫీ అంశం  రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు  అమెరికాలో కూడా ఎంతో పాపులర్ అయింది.అయితే రైతులకు కాదు విద్యార్థులకు మాత్రమే. గతంలోనే విద్యార్థులకు రుణ మాఫీ అమలు చేస్తున్న బైడెన్ ప్రభుత్వం దానిని మరింత కాలం పొడిగించారు.దీనితో 35 వేల అమెరికన్ విద్యార్థులు లబ్ది పొందనున్నారు.తమ ప్రభుత్వం ఇప్పటిదాకా విద్యార్థుల రుణ మాఫీపై వెయ్యి కోట్లు ఖర్చుచేశామని బైడెన్ తెలిపారు.రుణమాఫీ జరిగిన లబ్దిదారులలో ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించినవారే ఎక్కువగా ఉన్నారని బైడెన్ తెలిపారు. వారిలో డాక్టర్, లాయర్, పోలీస్ వంటి తదితర కోర్సులు చదివేవారు ఉండటం విశేషం. రుణమాఫీపై అమెరికన్ కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ బైడెన్ తాను విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. గతేడాది రుణమాఫి ప్రకటించిన దానిక కన్నా ఎక్కువగానే విద్యార్థులకు లబ్ది చేకూరేలా మరింత మందికి అవకాశం కల్పించామని ఆయన అన్నారు. లక్షా యాభై వేలకు గాను లక్షా అరవై వేల విద్యార్థులకు గతేడాది అవకాశం కల్పించామని బైడెన్ తెలిపారు. అయితే కేవలం ఈ సంవత్సరం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే రుణమాఫీ అంశాన్ని తెరపైకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అమెరికాలో యువ ఓటర్ల సంఖ్య ఎక్కవ కావడంతో యువతను ఆకర్షించేందుకే బైడెన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నారని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: