ఏపీ: కూటమి ప్రభుత్వంలో పవన్ పాత్ర నామ మాత్రమేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రభుత్వంలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం గా హోదానైతే తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అనే విషయం అటు కార్యకర్తలకు అభిమానులకు అంతుచిక్కడం లేదు. వాస్తవం ఎలా ఉన్నా పవన్ అనుసరిస్తున్న తీరు పైన స్పందిస్తున్న తీరు మాత్రం అంతంత గానే ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రంలో జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ చంద్రబాబుకు ఏపీకి రావాల్సిన అంశాలు నిధుల విషయాలపైన కేంద్ర దృష్టికి  తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఈ విషయం పైన కూడా పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉన్న స్పందించలేదు.

అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న గోరాతి ఘోరమైన పరిణామాలు చూసి కూడా ఏ విధంగా స్పందించలేదు. ముఖ్యంగా చిన్న పిల్లల పైన, మహిళల పైన  జరుగుతున్న అత్యాచారాల పైన కూడా డిప్యూటీ సీఎం స్పందించలేదు. రాజకీయ హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో సర్కార్ మద్దతుగానే మాట్లాడుతున్నారా లేకపోతే మౌనంగా ఉన్నారా అనే ప్రశ్న ఇప్పుడు జనసేన కార్యకర్తలు అధినేతను సైతం ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒకప్పుడు మద్దతుగా అనేక విషయాల పైన స్పందించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు.

విశాఖలో వెలుగు చూసిన ఎర్రమట్టి దిబ్బల వ్యవహారం కూడా గత నాలుగు రోజులుగా ఏపీ రాష్ట్రంలో వైరల్ గా మారింది. ఈ మట్టి దిబ్బల చదును చేస్తున్నారని ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి అంటూ తెలుపుతున్నారు. ఈ విషయం పైన కూడా అటు పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉన్న స్పందించలేదు.. కేవలం మౌనం మాత్రమే పాటిస్తూ ఉన్నారు. ఇలా అన్ని విషయాలలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటే కూటమి సర్కారు ప్రభుత్వంలో ఆయన పాత్ర కొంతమేరకే ఉందని భావన ఇప్పుడు అటు అభిమానులలో కనిపిస్తోంది. ఇలా అయితే రాబోయే రోజుల్లో పవన్ మీద ఉండే నమ్మకం కూడా ప్రజలలో కోల్పోయేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: