విజ‌య‌సాయిరెడ్డి DNA వ‌ర్సెస్‌ NDA ... మ‌చ్చ పోవాలంటే ఈ ప‌ని చేయాల్సిందే..?

RAMAKRISHNA S.S.
వైసీపీ నాయకుడు.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడితులో పడ్డ ఎలుకలా తయారయింది. ఎరక్కపోయి ఇరుక్కుపోయానే అని ఆయన ఎంతో బాధపడుతున్నారు. ఈ అక్రమ సంబంధం విషయం నుంచి ఎలా బయటపడాలో తెలియక తెగ గింజుకుంటున్నారు. ఆయన ఏం చేయాలో తెలియక..? ఏం మాట్లాడాలో తెలియక..? ఏదో చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో మీడియా, సోషల్ మీడియా చేర్చే అంత విజయసాయిరెడ్డి గురించే జరుగుతోంది. శాంతి అనే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌తో.. శారీరక సంబంధం ఉందని ఆమె మొదటి భర్త మదన్మోహన్ మానిపాటి.. విజయ్ సాయి పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు.. తన భార్యకు పుట్టిన బిడ్డకు విజయసాయి తండ్రి అన్న అనుమానం తనకు ఉందని.. దీనిపై విజయ్ సాయి డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధపడాలని మదన్మోహన్ సవాలు చేశారు.


తనపై వచ్చిన ఆరోపణలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాటిని ఖండించిన విజయసాయి రెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు మాత్రం ఒప్పుకోలేదు. తాను తప్పు చేయలేదు.. తాను ఎందుకు..? డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధపడాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ అంతా డీఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడుతుంటే.. దాన్ని డైవర్ట్ చేసేందుకు విజయసాయి తన అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. తనపై పడిన మరకలను తుడుచుకునే ప్రయత్నం చేయకుండా.. కూటమి సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు.


రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు -ఘోరాలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. డీఎన్ఏ చ‌ర్చ నుంచి మీడియాను డైవర్ట్ చేసేందుకే ఆయన ఎన్డీయే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి డీఎన్ఏ విషయం ఇప్పుడు ప్రజల్లోకి, మీడియాలోకి బలంగా వెళ్లిపోయింది. ఆయన అందుకు సిద్ధపడకపోతే ఆయనపై ఉన్న ఆ మచ్చ ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని చర్చ అయితే నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: