రాజకీయాల్లోకి వచ్చాక.. జూ. NTR డ్రెస్సింగ్ స్టైల్ ఇలా మారిపోతుందా?

praveen
సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక ప్రజా ప్రతినిధికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ప్రజలు ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. కేవలం రాజకీయ నాయకుడి ప్రసంగాలు మాత్రమే కాదు.. ఆయన హావ భావాలు ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఇలా అన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనె ఇప్పటివరకు రాజకీయాలలో ఎవరికి వారు ప్రత్యేకమైన డ్రెస్సింగ్ స్టైల్.. టాకింగ్ స్టైల్ కలిగి ఉన్నారు. అంతేకాదు ప్రత్యేకమైన హావభావాలను కూడా ప్రసంగాలు ఇస్తున్న సమయంలో ప్రదర్శిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇక ఎన్నో ఏళ్ల నుంచి నెరిసిన గడ్డంతో కనిపిస్తూ ఉంటారు. అందరిలా తెలుపు రంగు ఖద్దరు బట్టలు వేయకుండా... బిస్కెట్ కలర్ లో కాస్త డిఫరెంట్ గా కనిపించే ఖద్దరు డ్రెస్ వేసుకుంటూ ఇక ఎప్పుడు డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా వెలుగోందుతున్న జూనియర్ ఎన్టీఆర్ రానున్న రోజుల్లో రాజకీయాల్లోకి వస్తే.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది కూడా పలువురు అభిమానులు చర్చించుకుంటున్నారు. గతంలో టిడిపి తరఫున ప్రచార నిర్వహించిన సమయంలో పూర్తిగా కాకి డ్రెస్ వేసుకొని ప్రసంగాలు ఇచ్చారు. అయితే సబ్జెక్టు పై ఎన్టీఆర్కు ఉన్న పట్టు అలాంటి ఇలాంటిది కాదు. అయితే ఒకప్పుడు కాకి డ్రెస్ వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక ఇప్పుడు అదే డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తారా.. ట్రెండ్ కి తగ్గట్లుగా డ్రెస్సింగ్ పూర్తిగా మార్చేస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

 ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకప్పటి రాజకీయ నాయకుల్లాగా కద్దరు చొక్క కద్దర్ పాయింట్ వేసుకోవడం లేదు ఏకంగా కుర్తా వేసుకొని సరికొత్త లుక్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకప్పటిలా కాకీ డ్రెస్ కాకుండా తెలుపు రంగు కద్దర్ కుర్తా వేసుకొని కనిపించే ఛాన్స్ ఉందని అభిమానులు అనుకుంటారూ. అయితే ఇలాంటి లుక్ అటు ఎన్టీఆర్ కి బాగా సెట్ అవుతుందని కూడా ఫ్యాన్స్ భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలోకి వచ్చి ఏకంగా పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఎంతోమంది నందమూరి అభిమానులు  కూడా కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికైతే  రాజకీయాలపై ఆసక్తి లేదు అంటూ చెప్పినా ఎన్టీఆర్ మరి రానున్న రోజుల్లో అయినా పాలిటిక్స్ వైపురావడానికి ఆలోచన చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: