రేవంత్ రెడ్డి : సీఎం.. కానీ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని డ్రెస్సింగ్ స్టైల్..!

Pulgam Srinivas
రాజకీయ నాయకులు అనే వారు ఎంతో మంది కి ఆదర్శప్రాయంగా ఉండాలి. వారు చేసే పనులు కానీ ... వారు బట్టలను ధరించే స్టైల్ కానీ అన్నీ కూడా సమాజం స్వీకరించే విధంగా ఉండాలి. ఇకపోతే మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతో మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. అందులో చాలా మంది తమ డ్రెస్సింగ్ స్టైల్ తోనే జనాలను ఆకట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఇక కొంత మంది నాయకులు ఒకే రకమైన డ్రెస్సింగ్ తో ఎప్పుడు కనిపిస్తూ వారి ప్రెస్సింగ్ స్టైల్ నే ఒక సింబల్ గా ఏర్పరచుకున్న వారు కూడా ఉన్నారు.
ఇకపోతే అద్భుతమైన డ్రెస్సింగ్ స్టైల్ లో మైంటైన్ చేస్తున్న తెలుగు రాజకీయ నాయకులలో రేవంత్ రెడ్డి ఒకరు. ఈయన తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీలో మంచి స్థాయికి ఎదిగారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి గుర్తింపు లేకుండా పోయింది. దానితో ఈయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీలో అద్భుతమైన వ్యక్తిగా ఈయన ఎదిగాడు. ఇక ఈ సారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి. అలాగే ఈ పార్టీ గెలవడంలో కీలక పాత్రను పోషించిన రేవంత్ రెడ్డి కి ముఖ్యమంత్రి పదవి దక్కింది.
ఇకపోతే రేవంత్ రెడ్డి కూడా తన అద్భుతమైన డ్రెస్సింగ్ స్టైల్ తో జనాలను ఆకట్టుకున్నాడు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన వయసు ఏమీ ఎక్కువ కాకపోవడంతో చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపిస్తూ ఉంటాడు. ఎక్కువ శాతం బ్లాక్ కలర్ లో ఉన్న ప్యాంట్ ను ధరిస్తాడు. అలాగే దాదాపు ఎక్కువ శాతం వైట్ కలర్ లో ఉన్న షర్టును ధరించి హాండ్స్ కి బటన్స్ పెట్టకుండా పోల్డ్ చేసి స్టైలిష్ లుక్ లో ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి దాదాపు ఎక్కువ శాతం ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ లోనే బయటకి వెళుతూ ఉంటాడు. దానితో ఈయన డ్రస్సింగ్ స్టైల్ కు ఒక ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: