ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, విజయసాయిరెడ్డి వ్యవహారం గురించి వినిపిస్తోంది. అయితే శాంతి విజయ్ సాయిరెడ్డి వల్ల గర్భం దాల్చిందని తన భర్త మదన్మోహన్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీనిపై స్పందించినటువంటి శాంతి నా గర్భానికి కారణం మదన్మోహన్ కాదని ఆయన విడాకులు ఇచ్చి, సుభాష్ అనే వ్యక్తిని మరో పెళ్లి చేసుకున్నానని, ఆయన వల్లే నాకు గర్భం వచ్చిందని తెలియజేసింది. అయితే ఇదే విషయంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందిస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. పత్రికలను, టీవీ ఛానల్స్ ను, వారి అధినేతలను దారుణంగా తిట్టి పోశారు. దీనిపై టీవీ5 స్పందించి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ సాయి రెడ్డి ఏమన్నారు ఆ వివరాలు చూద్దాం..
ఒక ఎంపీగా నేను సమాజాన్ని తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి నేను చేస్తూ ఉంటే, కొంతమంది బరితెగించి, హద్దులు మీరి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒక ఆదివాసి స్త్రీతో సంబంధం ఉన్నట్టు, సృష్టించి వార్తలు రాయడం, ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాలను నేను ప్రశ్నిస్తున్నాను. నాకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి వంశీకృష్ణ, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, వెంకటకృష్ణ, సాంబడు మీ అందరిపై తప్పకుండా చట్టానికి లోబడి చర్యలు తీసుకునేలా చేస్తానని విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీనిపై తీవ్రస్థాయిలో కౌంటర్ ఇస్తూ విరుచుకుపడింది టీవీ5. విజయసాయిరెడ్డికి టీవీ5 సూటి ప్రశ్నలు అనే పేరుతో కథనాలు వెళ్లి ఇచ్చేసింది.
అసలు ఆరోపణలు ఎవరివి, నువ్వు ప్రశ్నించేది ఎవరిని, మహిళ భర్త మదన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే మేము వార్తలుగా చూపించామని, ఆ ఫిర్యాదులో ఉన్న అంశాలనే ప్రస్తావించాం, తప్ప మేము కొత్తగా ఏమీ ప్రస్తావించలేదని అన్నారు. అసలు నువ్వు సమాధానం చెప్పాల్సింది మదన్ మోహన్ కి కానీ, నీకు శాంతికి ఎలాంటి సంబంధం లేదని నీకు నువ్వే నిరూపించుకోవాలి కదా, మీ సంబంధాలతో మీడియాకు సంబంధం లేదు. మీరు ఎలాంటి సంబంధాలు ఎవరితో పెట్టుకున్నారో చర్చించే తీరిక tv5 ఛానల్ కు లేదని, మీరు ఎలాంటి వ్యక్తులో, మీ క్యారెక్టర్ ఎలాంటిదో జనాలు రకరకాలుగా చర్చించుకుంటున్నారని అన్నారు. ఈ విధంగా మీరు మీడియాపై విరుచుకు పడడం సమంజసం కాదని దారుణంగా ప్రశ్నించింది టీవీ5.