లేడీ ఎమ్మెల్యే మాధ‌వి Vs తెలుగు త‌మ్మ‌ళ్లు... జ‌న‌సేన టీడీపీ వార్ మొద‌లైందా..?

RAMAKRISHNA S.S.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీనియర్ నేత మంత్రి అచ్చెం నాయుడు.. శ్రీకాకుళంలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్ళ వేసుకొని ఆఫీసులకు వెళ్ళండి. ఏ ఆఫీసర్ పని చేయరో వారి అంతు చూస్తామని ఒక హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. మీరు పసుపు బిళ్ళ వేసుకుని ఆఫీసులకు వెళితే ప్రభుత్వ అధికారులు అందరూ కుర్చి వేయించి మరి మీ పని చేయించి పంపుతారని.. అచ్చెం న్నాయుడు ఆదేశించారు. అయితే ఇప్పుడు విజయనగరం జిల్లాలో జనసేన ఏకైక మహిళ ఎమ్మెల్యే లోకం మాధవి అదే పని చేసి చూపించారు. ఆమె చేసిన పని వల్ల టీడీపీ, జనసేన మధ్య గొడవ మొదలైంది.


నెల్లిమర్ల జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవి ఏ గ్రామం నుంచి ఏ నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వాలో.. ఎవరు ? వస్తే పనులు చేసి పెట్టాలో అని ఒక జాబితా రెడీ చేసి అధికారులకు ఇచ్చారట. అయితే అందులో అందరు జనసేన నాయకులే ఉన్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు భ‌గ్గుమంటున్నారు. నియోజకవర్గంలో అసలు జనసేనకు క్యాడర్ లేదని.. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కలిసికట్టుగా పనిచేసే మాధవి గెలుపు కోసం పనిచేశామని.. కేవలం తమ వల్లే లోకం నాగ మాధవి ఎమ్మెల్యేగా విజయం సాధించిందని.. ఇప్పుడు టీడీపీ నేతలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం సొంత పార్టీ వారికే ప్రాధాన్య‌త‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.


అంతేకాదు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె జనసేన నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారని.. టీడీపీ వారిని ఏ సమావేశాలకు పిలవడం లేదని.. తెలుగు తమ్ముళ్లు అందరూ కలిసి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముందు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లిమర్లలో టీడీపీకి గట్టిపట్టున్న తాము జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఇప్పుడు తమను చిన్నచూపు చూడటం తగదని వారు వాపోతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే వర్సెస్ తెలుగు తమ్ముళ్లు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడు అది ఉత్తరాంధ్ర‌కు.. అందులో విజయనగరంకు పాకేస్తుంది. మరి భవిష్యత్తులో ఇంకెన్ని నియోజకవర్గాలలో ఈ రెండు పార్టీల నేత్ర మధ్య ఈ గొడవలు స్టార్ట్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: