బాబు బిగ్ సవాళ్లు : రైతుల ఎదురుచూపులన్నీ వాటిపైనే.. అవన్నీ జరిగేనా..?

Pulgam Srinivas
భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల సంఖ్య అత్యంత ఎక్కువగా ఉంటుంది. దానితో దేశ వ్యాప్తంగా అయిన రాష్ట్రాలలో అయినా రాజకీయ నాయకులు రైతుల కోసం అనేక పథకాలను రూపొందిస్తూ ఉంటారు. అలాగే వారి ఓట్లను దక్కించుకోవడం కోసం అనేక ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పటికే దేశంలోని ఎన్నో రాష్ట్రాలలో రైతుల కోసం ఎన్నో ప్రత్యేక పథకాలను పెట్టారు. ఎన్నో అమలు కూడా చేశారు. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతుల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేశారు. వాటిలో చాలా సక్సెస్ కూడా అయ్యాయి.

ఇకపోతే చంద్రబాబు నాయుడు 2014 నుండి 2019 వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సమయంలో ఈయన రైతుల కోసం అనేక పథకాలను అమలు చేశారు. అందులో భాగంగా రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేశారు. కానీ ఆయన 2019 వ సంవత్సరం ఎలక్షన్ల ముందు వరకి కొన్ని విడతలలో మాత్రమే దీనిని అమలు చేశారు. ఇక అధికారంలోకి వచ్చాక మిగిలిన విడతలను చేస్తాము అని చెప్పారు.

కాకపోతే ఆయన అధికారంలోకి రాలేదు. ఇక మళ్ళీ కొన్ని రోజుల క్రితమే ఈయన అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం చంద్రబాబు రుణమాఫీ ఎలా చేయాలి ... విడుదల భారీగా చేయాలా ... మరేదైనా పద్ధతి ఉందా అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు ప్రస్తుతం అమలులో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొన్ని ప్రాంతాలలో కొంత మంది రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి.

వాటిని కూడా లేకుండా చేయడం కోసం బాబు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రైతుల కోసం మరికొన్ని ప్రత్యేక పథకాలను కూడా తీసుకురావడానికి ఆయన రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇలా చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాలలో రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేయాలి అనుకున్నట్లు తెలుస్తోంది. మరి అవన్నీ సక్సెస్ అవుతాయా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: