బాబు బిగ్ సవాళ్లు : తలకు మించిన భారంలా తల్లికి వందనం పధకం..

murali krishna
* బాబు ముందు భారీ సవాళ్లు..హెచ్చరిస్తున్న రాజకీయ విశ్లేషకులు
* పథకాల మోజులో ప్రజలు ..అభివృద్ధిని అటకెక్కిస్తున్న నాయకులు
* ఇలానే కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితేమిటో  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన  గత ఐదేళ్లుగా కొనసాగింది.ఈ సారి ఎన్నికలలో కూడా జగన్ సంచలనం విజయం సాధిస్తారని అంతా భావించారు.కానీ ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ,బీజేపీ, జనసేన కూటమి సంచలన విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి రికార్డు నెలకొల్పింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలసి చంద్రబాబు మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.అయితే  నాలుగోసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు వహించిన చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్లు వున్నాయి.వాటన్నిటిని అధిగమించి బాబు పాలన ఎలా కొనసాగిస్తారనేదే ప్రశ్నర్ధకంగా మారింది.అయితే కూటమి అధికారంలోకి రావడానికి జగన్ మీద వ్యతిరేకత ఒక కారణం అయితే సూపర్ సిక్స్ పధకాలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.గతంలో గడప గడపకు ఎన్నో సంక్షేమ పధకాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం తోచిన చోటల్లా అప్పులు చేసుకుంటూ వచ్చింది.

దీనితో రాష్ట్రము  అప్పులు కుప్పగా మారింది.అయితే జగన్ కంటే బాబు ప్రవేశ పెట్టిన పధకాల సంఖ్య చాలానే వుంది.గతంలో అమ్మఒడి పధకం కింద ఇంటికి ఒక బిడ్డ కు సంవత్సరానికి 15000 వేల రూపాయలు ఇచ్చారు.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పధకం కింద ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి 15000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.అయితే ప్రస్తుతం వున్నా రాష్ట్ర పరిస్థితికి తల్లికి వందనం పధకం పెద్ద నష్టాన్నే మిగులుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఖజానా అంత పధకాలకు సరిపెడితే రాష్ట్రం లో అభివృద్ధి కుంటుపడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.ఇలానే కొనసాగితే కూటమి ప్రభుత్వం ముందు ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటుంది.మరి పధకాల అమలులో బాబు తన మార్క్ చూపిస్తారో లేదో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: