తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన మెగా హీరో.. ఎందుకంటే..?

Suma Kallamadi

 ఒక చిన్నారి, ఆమె తండ్రి వీడియోపై యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అనుచిత వ్యాఖ్యలు చేసి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరితగతిన చర్య తీసుకున్నారు. వీరిపై కఠిన శిక్ష తీసుకోవాలని బహిరంగంగా డిమాండ్ చేశారు మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. అయితే ఆయన ఇచ్చిన కంప్లైంటుకు రేవంత్ రెడ్డి త్వరగా స్పందించారు అందువల్ల. ఈరోజు నటుడు సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) సీఎం ను స్పెషల్ గా కలిశారు. అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. వీరిద్దరూ ఒక ఫోటో కూడా దిగారు అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ కేసు గురించి తెలియని వారు సాయి ధరంతేజ్ రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారో అని కామెంట్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత సంగతి తెలుసుకొని ఈ మెగా హీరోని పొగుడుతున్నారు. కొద్దిరోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ యూట్యూబర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. పిల్లల దుర్వినియోగం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నిరోధించే మార్గాలపై చర్చించడానికి ముఖ్యమంత్రితో సమావేశమయ్యాడు.
తెలంగాణను పిల్లలకు సురక్షితమైనదిగా చేయడానికి కఠినమైన నియమాలు, చర్యలను తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకే ఈ మెగా హీరో తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు, ఇది మార్పు వైపు ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నాడు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు వెంటనే స్పందించారు.  తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై ఐటీ చట్టం, BNS, POCSO చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
బెంగుళూరులో అరెస్టు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు, ఇంత త్వరగా స్పందించినందుకు పోలీసులను నెటిజన్లు ఎంతో మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగవు అని బలమైన సంకేతం ఇచ్చేలాగా పోలీసులు సీరియస్ గా టేకప్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: