వాళ్ల‌కు థ్యాంక్స్‌ అంటూ చావుని ఎలా త‌ప్పించుకున్నాడో చెప్పిన ట్రంప్?

Purushottham Vinay

పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై జరిగిన కాల్పుల ఘటన గురించి డొనాల్డ్ ట్రంప్ స్పందించడం జరిగింది. జరిగిన ఘటన గురించి సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు. తన ప్రాణాలను కాపాడిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి డోనాల్డ్ ట్రంప్ ధన్యవాదాలు తెలియజేశారు. `గాడ్ బ్లెస్ అమెరికా` అంటూ డోనాల్డ్ ట్రంప్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. అక్కడ తనపై కాల్పులు జరిపినపుడు ఓ బుల్లెట్ తన చెవి పై నుంచి దూసుకు వెళ్లిందని ట్రంప్ వెల్లడించారు." `కాల్పులు జరిగిన సమయంలో వేగంగా స్పందించి నా ప్రాణాలు కాపాడిన సీక్రెట్ సర్వీస్‌కి ఇతర సిబ్బందికి నా ధన్యవాదాలు. ఇటువంటి చర్య అమెరికాలో జరగడం నమ్మశక్యంగా లేదు. ఈ కాల్పులు జరిగిన వ్యక్తి గురించి నాకేం తెలియదు. అసలు కాల్పుల శబ్దం వినిపించినపుడు నాకేం అర్థం కాలేదు. అంతలోనే ఓ బుల్లెట్ నా చెవి పై నుంచి అలా దూసుకువెళ్లిపోయింది. నాకు చాలా రక్తస్రావం జరిగింది.

ఈ కాల్పుల ఘటనలో మరణించిన వ్యక్తికి ఇంకా తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తికి నా సానుభూతి తెలియజేస్తున్నా. గాడ్‌బ్లెస్ అమెరికా`" అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పోస్ట్ స్పందించడం జరిగింది.పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ చెవి పై నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయనకు గాయమై తీవ్ర రక్తస్రావం అయింది. ఆ బుల్లెట్ నేరుగా ట్రంప్ పైకే దూసుకెళ్లడంతో ఇది ఆయనపై జరిగిన హత్యాయత్నంగానే భావిస్తున్నారు. ట్రంప్‌ చుట్టూ వలయంలా ఏర్పడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను సురక్షితంగా కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు. ఇంకా అలాగే కాల్పులకు తెగబడిన దుండగుడిని కూడా మట్టుబెట్టారు. ఇంకా ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు చాలా తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: