అందువల్లే రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది.. హీరోయిన్ కామెంట్స్..!
ఈ మూవీ జూలై 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది చిత్ర బృంధం. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ..'దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత..థియేటర్స్ లో ప్రేక్షకులు నన్ను చూడటానికి, నన్ను నేను థియేటర్స్ లో చూసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆడియన్స్ కి నా ఎనర్జీ ఇష్టం. యాక్సిడెంట్ కారణంగా నా సోల్జర్ కి గాయమైయింది.
మళ్ళీ ఫుల్ గా ఫిట్ అయినా మునుపటి ఎనర్జి ఇచ్చిన తర్వాతే స్క్రన్ మీద కనిపించాలని భావించాను. అందుకే బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు డార్లింగ్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇలా అన్ని వున్న కంప్లీట్ ఎంటర్ టైనర్' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే..తన తదుపరి చిత్రాల గురించి చెప్తూ. 'స్వయంభూ' తో పాటు మరో రెండు సినిమాలు డిస్కీర్షన్ లో వున్నాయి. ప్రస్తుతం డార్లింగ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ఈ మూవీ జూలై 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది చిత్ర బృంధం.