మనుషులు కలిశారు.. మనసులు కలుస్తాయా.. రెండు రాష్ట్రాల పరిస్థితేంటి...?

Divya
•గురువునే విమర్శించిన రేవంత్ రెడ్డి
•చంద్రబాబు శిష్యుడు కోరిక నెరవేరుస్తారా
•మనుషులు కలిశారు కానీ మనసులు కలవవా..
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

దివంగత మహానేత రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుకోలేకపోయింది. ఇక 2019 ఎన్నికలలో  మహానేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వైయస్సార్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. ఇక 2024 ఎన్నికలలో ఎలాగైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన టిడిపి అన్నట్టుగానే కూటమితో చేతులు కలిపి 164 సీట్లు సొంతం చేసుకొని అఖండ విజయాన్ని దక్కించుకుంది. ఇక మరొకవైపు చంద్రబాబు శిష్యుడుగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఆలోచనలను ఎవరు అడ్డుకట్ట వేయలేకపోయారు.  
ఆయన వేగంగా కేసీఆర్ చేసిన తప్పిదాలను ఎండగడుతూ ప్రజలలో కెసిఆర్ పై నమ్మకాన్ని కోల్పోయేలా చేశారు. పైగా రాహుల్ కొన్ని రోజులపాటు తెలంగాణలో ప్రసంగించడం రేవంత్ రెడ్డికి ప్లస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అఖండ విజయంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి.

గతంలో గురు శిష్యులుగా ఉన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇద్దరూ అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రదేశ్ లకు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడ గురు శిష్యుల బాంధవ్యం ఎలా ఉన్నా సరే మనుషులు ఇద్దరు కలిశారు కానీ వీరి మనసులు కలుస్తాయా అని అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.  ఇటీవల జరిగిన సమావేశంలో చంద్రబాబు మాటలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం బట్టి చూస్తే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో భాగంగా అక్కడ ఏపీ వి మూడు భవనాలు వుంటే ఇవ్వమని అడిగారు చంద్రబాబు. అయితే రేవంత్ రెడ్డి అర్జీ పెట్టుకోండి.. అర్జీ పెట్టుకుంటే ఇస్తాను అని చెప్పాడు.. అయితే అర్జీ ఎవరైనా పెట్టుకుంటారు. అన్ని రాష్ట్రాలలో అన్ని భవనాలు ఉంటాయి. ఎవరైనా అర్జి పెట్టుకుంటే కచ్చితంగా ఇవ్వాలి. కానీ గురువు అన్న విశ్వాసం లేకుండా అర్జి పెట్టుకోవాలని చెప్పాడు.. మరొకవైపు ఏడు మండలాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడిగారు ఈ మండలాలు కనుక చంద్రబాబు ఇచ్చేస్తే చంద్రబాబు తన కొరివి తానే పెట్టుకున్నట్లు అవుతుంది. మరొకవైపు అక్కడ బిల్డింగులు ఇస్తే రేవంత్ రెడ్డి దోపిడీ అయిపోతారు. కుమ్మక్కు అయిపోతున్నారు.. అంతా దోచుకుంటున్నారు అంటూ బీఆర్ఎస్,  బిజెపి వాళ్లు విమర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల విభజన అంతర్రాష్ట్ర రహదారులు విద్యుత్ బకాయిలు సరిహద్దు సమస్యలు అంతేకాదు నల్గొండలో మురగాల అనే గ్రామం ఉంది.. అది కూడా ఆంధ్రదే దాన్ని కూడా ఇవ్వాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు... ఇక ఇవన్నీ జరిగితే అటు తెలంగాణ రేవంత్ రెడ్డికి ఇబ్బందే ఇటు వారు ఇవ్వకపోతే చంద్రబాబుకు ఇబ్బంది.. ఇక అలా  మనుషులు కలిశారు కానీ మనసులు కలవక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. మరి వీరిద్దరి కలయిక రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: