కూటమి పాలన@30 : కేంద్రంలో పెమ్మసాని.. రాష్ట్రంలో పవన్.. పక్క ప్లాన్ రెడీ చేస్తున్నారుగా?

praveen
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు గడిచిపోయింది  ఈ క్రమంలోనే ఈ 30 రోజుల పాలనలో సీఎం చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి వరకు ఎవరు ఎలాంటి ముందడుగు వేశారు. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల దిశగా ఇక కొత్త ప్రభుత్వం ఎంతవరకు ముందుకు సాగింది అన్న విషయం గురించి కూడా చర్చించుకుంటున్నారు.

 అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి గేమ్ చేంజర్ గా మారిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అంతేకాకుండా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పవన్ ముందుకు సాగుతున్నారు. ప్రతి గ్రామానికి రహదారిని అనుసంధానం చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఏకంగా 7213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఇదంతా చేయడానికి కేంద్రం నుంచి సహకారం ఎంతో అవసరం.

 ఎలాగో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. దీంతో కేంద్ర నుంచి సహకారానికి తిరుగులేదు. దానికి తోడు ఇక టిడిపి నేత గుంటూరు ఎంపీ పెమ్మసాని కేంద్రం మంత్రిగా ఉన్నారు. ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ  కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిత్వ శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి సహాక సహాయ మంత్రిగా పెమ్మసాని.. రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ ఉండడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎంతో సులభంగా వచ్చేస్తాయని.. తద్వారా ఇక గ్రామాల రూపురేఖలు మార్చేందుకు అటు కేంద్రమంత్రి పెమ్మసాని ఇటు రాష్ట్ర మంత్రి పవన్ ఇప్పటికే పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారని.. నెల రోజుల్లోనే ఈ విషయంపై కీలక విషయాలను చర్చించారని.. ఇక రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: