కూటమి పాలన @30: ఆపదలో అస్తమందించే బాంధవుడు వాసంశెట్టి.!!

frame కూటమి పాలన @30: ఆపదలో అస్తమందించే బాంధవుడు వాసంశెట్టి.!!

Pandrala Sravanthi
- మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి..
- ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా పేద ప్రజలకు సేవలు..
- రామచంద్రపురం రారాజు వాసంశెట్టి సుభాష్..

కొంతమందికి అదృష్టం వెతుక్కుంటూ తలుపు తడుతుంది. దాన్ని అక్కున చేర్చుకొని కాపాడుకుంటేనే ముందుకు వెళ్లగలుగుతాం. అలాంటి అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ వాసంశెట్టి సుభాష్. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా కొట్టేశారు. అలాంటి సుభాష్ రాజకీయ నేపథ్యం ఏంటి..ఆయన ఎక్కడ పుట్టారు, ఎలాంటి పనులు చేశారు అనే వివరాలు చూద్దాం. రామచంద్రాపురం శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించినటువంటి వాసంశెట్టి శుభాష్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ముందు వైసీపీ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వాసంశెట్టి సుభాష్ సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందే టిడిపి పార్టీలో చేరారు. అలాంటి ఈయనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో  రామచంద్రపురం టికెట్ ఆయనకే కేటాయించారు చంద్రబాబు. మొదటి ఎన్నికల్లోనే అద్భుతమైన మెజారిటీతో గెలిచినటువంటి వాసంశెట్టికి మంత్రి పదవి అందించారు. అలాంటి వాసంశెట్టి రాజకీయ జీవితం విషయానికి వస్తే..సుభాష్ తాతయ్య సుబ్బన్న వ్యాపారంగంలో అగ్రగన్యుడు. 

కోనసీమలో ఈయనకు మంచి పేరు ఉంది. అంతేకాకుండా వాసంశెట్టి సుభాష్ తాత తండ్రి  అమలాపురంలో కౌన్సిలర్లుగా పలుమార్లు గెలిచారు. అమలాపురం మండలం శ్రీరాంపురానికి చెందినటువంటి వాసంశెట్టి సుభాష్  బిఎస్సి ఎల్ఎల్ బీ పూర్తి చేశారు. ఈయన మొదటిసారి వైసీపీ పార్టీలో చేరి యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా కూడా పని చేశారు. టిడిపి పార్టీలో చేరి 2024లో రామచంద్రపురం  నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీచేసి వైసిపి అభ్యర్థి పిల్లి పై సుభాష్  26,200ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసిపి పార్టీలో 10 సంవత్సరాల పాటు కష్టపడిన సుభాష్ కు ఎలాంటి గుర్తింపు లభించలేదు. దీంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి  గెలుపొంది మంత్రి పదవి పొందారు. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా పేరు మార్పు విషయంలో జరిగినటువంటి అల్లర్ల  కేసులో బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను అనేక ఇబ్బందులకు గురి చేశారు. అమాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరిన హై కమాండ్ పట్టించుకోలేదని  ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధంగా వైసీపీపై అలిగి పార్టీ కి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరినటువంటి వాసంశెట్టికి మొదటి ప్రయత్నంతోనే మంత్రి పదవి దక్కింది.

అలాంటి ఈయన విఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే వ్యాపారం ద్వారా అంచలంచెలుగా ఎదిగారు. దాని ద్వారా వచ్చినటువంటి లాభాలను కులమత ప్రాంతాలు అనే భేదాలు లేకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. తన దగ్గరికి సాయం కోసం వచ్చిన ప్రతి వ్యక్తికి సహకారం అందించడమే తనకు తెలిసిన విద్య. అంతేకాకుండా ఆయన రాయల్ వోకేషనల్ కాలేజీ స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. ఇప్పటికే ఈ కాలేజీలో చదివినటువంటి చాలామంది  నిరుపేద విద్యార్థులు మంచి రంగాల్లో ఉద్యోగాలు తెచ్చుకొని రాణిస్తున్నారు. కరోనా సమయంలో అందరూ ఇంట్లో కూర్చుంటే, వాసంశెట్టి మాత్రం ఎంతోమంది ప్రజలకు తిండి,మందులను అందించిన గొప్ప వీరుడు. ఎస్ఏఎఫ్ అనే ఒక  సంస్థను స్టార్ట్ చేసి దాని ద్వారా ఎంతో మంది నిరుపేదలకు సహకారం అందిస్తున్నాడు.  అంతేకాకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాడు. ఈ విధంగా తన సంస్థ నుంచి ప్రతి రోజు ఎంతో మంది పేద ప్రజలకు ఆహారం అందించడం, ఇలా ఎన్నో పనులు చేస్తూ వాసంశెట్టి కోనసీమలోనే  గొప్ప లీడర్ గా ఎదిగాడు. ఆయన టాలెంటును గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక కార్మిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: