కూటమి పాలన @ 30: పాలనలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్న మంత్రి..!

FARMANULLA SHAIK
* ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన నిమ్మల!
* మంత్రి అయినా కూడా మారని వైనం
* హామీలో భాగంగా మరో పధకానికి శ్రీకారం
(అమరావతి - ఇండియాహెరాల్డ్ ): ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే పనిలో లీనమైపోయింది. దానికి సంబంధించిన ఆయా శాఖల మంత్రులు మరియు అధికారులు పధకాలు అమలుకు కావాల్సిన విధి విధానాలు రూపొందించడంలో బిజీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కొంతమంది మంత్రులు తమ పాలనలో యాక్టివ్గా ఉండి ప్రజాసేవలో దూసుకుపోతున్నారు. అందులో పాలకొల్లుకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒకరు.రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా నిమ్మల గ్రామంలో జన్మించారు. ఆయన తన రాజకీయా జీవితాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించి 2005 లో పాలకొల్లు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికై 2006 నుండి 2009 వరకు మేయర్ గా పనిచేసారు. 2014 ఎన్నికల్లో తన ప్రత్యర్థి మేకా శేషుబాబు పై గెలిచారు.అలాగే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్లో కూడా తన ప్రత్యర్థి సత్యనారాయణ మూర్తి పై విజయం సాధించారు పాలకొల్లు ఎమ్మెల్యేగా, ప్రజా నాయకుడిగా నిమ్మల రామానాయుడుకి పాలకొల్లు నియోజకవర్గంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.సామాన్యులలో సామాన్యుడిలా కలిసిపోయే నిమ్మల రామానాయుడు మంత్రి అయిన తర్వాత చేస్తున్న పనులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిమ్మల రామానాయుడు స్థానికంగా ప్రజలతో కలిసిపోయి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసేవారు. చిన్నా పెద్ద తేడా లేకుండా, అన్ని పనులలోను కార్యకర్త మాదిరిగా తన భాగస్వామ్యాన్ని ఉండేలా చూసుకునేవారు. సామాన్య ప్రజలతో కలిసి చిన్న చిన్న పనులలో కూడా ఆయన భాగస్వామ్యం తీసుకునేవారు. అయితే మంత్రి అయిన తర్వాత కూడా నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు చేస్తూ కనిపించడం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణమైంది.ప్రజాసేవలో తనను తాను మరిచిపోయి పనిచేసే మంత్రి నిమ్మల రామానాయుడు జల వనరుల శాఖలోనూ తన మార్కు చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైనాయి కనుక 'తల్లికి వందనం' పధకం అమలు గూర్చి సీఎం చంద్రబాబు గారు తదితర శాఖ అధికారులతో చర్చిస్తున్నారని అన్నారు. అయితే తల్లికి వందనం పథకంపై వైసీపీ విషప్రచారం చేస్తుందని మంత్రి రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకీ అనుగుణంగానే సీఎం ముందుకు పోతున్నారని అన్నారు. దీని గూర్చి ఎవ్వరు అధైర్య పడొద్దని అన్నారు.సోషల్ మీడియాలో వస్తున్నా వైసీపీ ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నిమ్మల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: