15 రోజుల్లో బిఆర్ఎస్ ఖాళీ.. దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్?

praveen
రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది. ఏకంగా తెలంగాణ సాధించి పెట్టిన పార్టీగా పేరుగాంచిన బిఆర్ఎస్ పతనం కాబోతుందా.. పూర్తిగా ఆ పార్టీలోని ఎమ్మెల్యే లందరూ ఇతర పార్టీలోకి వెళ్లడంతో ఇక కారు ఖాళీ కాబోతుందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా అవును అనకుండా ఉండలేకపోతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుని తిరుగులేని పార్టీగా ఎదిగింది బిఆర్ఎస్.

 అయితే ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే సీన్ పూర్తిగా మారిపోయింది.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలలో బిఆర్ఎస్ గెలిచి బలమైన ప్రతిపక్షంగానే నిలిచింది. కానీ ఇక గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి ప్రతిపక్ష కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలను ఆకర్షించారో.. ఇప్పుడు గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే చేస్తున్నారు. ఏకంగా బిఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు అందరిని కూడా హస్తం గూటికి చేర్చుకుంటున్నారు. దీంతో ఎప్పుడు ఎవరు ఇలా పార్టీ మారి హస్తం గూటికి చేరుకుంటారో అనే విషయంపై ఒక క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతుంది అంటూ ఇక ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారు.

  ఇక ఇప్పుడు మరో 6 మంది ఎమ్మెల్యేలు కారు దిగి చెయ్యి అందుకోబోతున్నారు అన్న విషయంపై చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆత్మగౌరవం ఉన్న వారెవరు కూడా బిఆర్ఎస్ లో ఉండరు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రేపో ఎల్లుండో ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లు చేరుతారు. మరో 15 రోజుల్లో ఆ పార్టీలో ఎవరు ఉండరు. నాతో మరో పదిమంది ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు. కారు పార్టీలో ఇద్దరు ముగ్గురు మిగిలిన వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్లాలి అనే విషయంపై అయోమయంలో ఉంటారు. బిఆర్ఎస్ లో ఉండడానికి ఎవరు ఇష్టపడటం లేదు. కేటీఆర్ ఎవరికి విలువ ఇవ్వలేదు అంటూ దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దానం నాగేందర్ కూడా బిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg

సంబంధిత వార్తలు: