బాబు దూకుడు... ఏపీలో కొత్తగా మరో 5 ఎయిర్ పోర్టులు !

Veldandi Saikiran
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఐదు ఎయిర్‌ పోర్టులు కొత్తగా వస్తాయని ప్రకటించారు. కుప్పం, నాగార్జున సాగర్, ఇంకో మూడు ప్రాంతాలకు కొత్తగా నిర్మిస్తామని వెల్లడించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టు గ్రోత్ ఇంజెన్ లా తయారవుతుందని వివరించారు చంద్రబాబు నాయుడు.
హైదారాబాద్ కు శంషాబాద్  ఎయిర్‌పోర్టు ఎలా పని చేస్తుందో...ఇది కూడా ఉత్తరాంధ్రకు అంతే కీలకం అని చెప్పారు. భవిష్యత్ లో భోగాపురం అంతర్జాతీయ  ఎయిర్‌పోర్టు తో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతుందని వివరించారు. 2015 మే 15 న అప్పటి ముఖ్యమంత్రిగా ఈ ఎయిర్‌పోర్టుకు ఆమోదం చేశానని తెలిపారు చంద్రబాబు నాయుడు. వైసిపి వాళ్ళు వచ్చి మొత్తం కూని చేశారని ఆగ్రహించారు. పూర్తిగా చిన్నా భిన్నం చేశారని మండిపడ్డారు.
2700 ఎకరాల్లో 500 ఎకరాలు పక్కన పెట్టారని.... చేసిన శంకుస్థాపన లకే ...మరలా శంకుస్థాపన చేశారని నిప్పులు చెరిగారు బాబు. ఇప్పటి వరకు 31.8 శాతం వర్క్ పూర్తి అయిందన్నారు. ఎయిర్పోర్ట్ మంత్రి, ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థ ...ఇరువురు ఉత్తరాంధ్రకు చెందినవారే అని తెలిపారు. ప్రారంభంలో 4.5 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించనున్నారు... 400 కోట్ల తో ఫేజ్ వన్ స్టార్ట్ చేస్తున్నారని తెలిపారు చంద్రబాబు.
ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయో వివరాలు ఇవ్వమన్నానని... ఈ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టు పూర్తి అయితే... చుట్టూ పక్కల ప్రాంతాలు అన్ని అభివృద్ది చెందుతాయని చెప్పారు. కొన్ని రాష్ట్ర రహదారులు గుంతలుగా ఉన్నాయని... ఆ రోడ్లు అన్ని పూర్తి చేస్తామన్నారు. కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మారథం పట్టారని తెలిపారు. 2026 నాటికి  ఎయిర్‌పోర్టు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించానని... మోస్ట్...మోడరన్ ...ఎయిర్ పోర్టుగా ఈ ఎయిర్‌ పోర్టు రెడీ అవ్వాలన్నారు. ఇది ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: