తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఓవైపు బిజెపి మరోవైపు కాంగ్రెస్ ఎదురుచూస్తున్న తరుణంలో పాత కొత్త పార్టీ అరంగేట్రం చేయబోతోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా. ఏపీలో అద్భుతమైన మెజారిటీతో చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యారు. అంతేకాకుండా దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన నాయకుడిగా మారారు. టిడిపిని తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించాలనే భవనతో ఆయన ఉన్నారట. అయితే గత వారం హైదరాబాదులో చంద్రబాబు పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది. తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పాగా వేయబోతుందని అప్పుడే సంకేతాలు ఇచ్చారు. అయితే టిడిపి పార్టీ ఇదివరకే తెలంగాణలో ఉంది.
కానీ పార్టీకి సంబంధించిన అధినాయకులు ఎవరు కూడా భరోసా ఇవ్వకపోవడం వారంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో కార్యకర్తలు అంతా సైలెంట్ అయిపోయారు. కొంతమంది ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. అలాంటి ఈ తరుణంలో ఏపీలో అద్భుతంగా పట్టు సాధించిన చంద్రబాబు తెలంగాణలో కూడా పట్టు సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో టీటీడీపీ తెలంగాణ బాధ్యతలని నారా బ్రాహ్మణికి అప్పగించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని బాలకృష్ణ తన భర్త లోకేష్ తో కూడా చర్చించారని వారు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే బ్రాహ్మణి చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ తో కలిసి రాష్ట్రంలో పర్యటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోయింది. దీంతో ఆమెకు కూడా రాజకీయంగా పోరాడే శక్తి ఉందని అర్థమైంది. ఇదే తరుణంలో ఆమెను తెలంగాణ టిడిపి బాస్ ను చేస్తే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. అంతే కాదు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చతికిల పడింది. ఆ స్థానాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి తెలంగాణలో టిడిపి పుంజుకుంటుందా లేదంటే వైఎస్ఆర్ షర్మిల పార్టీ లాగే పాతాళంలో పడిపోతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.