ఏపీకి మోడీ బంపర్ ఆఫర్..25 వేల కోట్లు రిలీజ్ !

Veldandi Saikiran

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీకి అసలు రాజధాని లేకుండా పోయింది. 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని చేస్తామని ప్రకటించారు. దీనికి అప్పుడు ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. ఈ తరుణం లో అమరావతి పనులు కూడా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.  దీనికోసం దాదాపు 33 వేల ఎకరాల రైతుల భూములు కూడా వాడుకున్నారు.

అయితే అనూహ్యంగా 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. ఆ తర్వాత అధికారంలోకి జగన్ మోహన్ రెడ్డి ఈ రావడం జరిగింది. చంద్రబాబు గీసిన ప్లాన్ మొత్తం రద్దుచేసి... ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పాలనపరమైన రాజధానిగా అమరావతిని, కోర్టులో సివిల్ కేసుల కోసం కర్నూలును రాజధానిగా చేస్తామని జగన్ ప్రకటించారు. పారిశ్రామిక అలాగే ఐటీ శాఖ అభివృద్ధి పరంగా... విశాఖను ఫైనల్ చేశారు.

అయితే ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు రాగానే... మళ్లీ అమరావతిని రాజధానిగా ప్రకటించేశారు. అంతేకాదు మరో ఐదు సంవత్సరాలలో... అధునాతన రాజధానిని తయారు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీనికి కేంద్ర సపోర్ట్ కూడా విపరీతంగా ఉంది. వైసిపి మినహా తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు అమరావతికి కట్టుబడి ఉన్నాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అమరావతిని డెవలప్మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై నితిన్ గడ్కరి  ని కూడా కలిశారు. ఈ సందర్భంగా దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో ... ఈ ఔటర్ రింగ్ రోడ్డును... ఎక్సప్రెస్ వేగా మార్చేందుకు... నిర్ణయం తీసుకుందట కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ఖర్చు అయ్యే మొత్తం డబ్బును మోడీ ప్రభుత్వం... చెల్లించబోతుందని వార్తలు వస్తున్నాయి. అటు అమరావతి కోసం కూడా నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: