పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు ప్రణీత్ హనుమంతు?

Purushottham Vinay

పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు ప్రణీత్ హనుమంతు?
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అనే పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. డార్క్ కామెడీ, రోస్ట్ వీడియోస్ పేరిట వికలాంగులని, చిన్న పిల్లలని, ఇంకా నచ్చని వారిని విచ్చల విడిగా విపరీతంగా, ఇష్టానుసారంగా ట్రోల్ చేయడం ఇలాంటి నిందితుల హాబీ.ఈ క్రమంలో తండ్రీకూతుళ్ల బంధంపైనా వీడు, వీడి బ్యాచ్ పిచ్చిగా కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిందితుడు ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. బుధవారం వీడిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో హైదరాబాద్ కు తీసుకురానున్నారు. వీడిపై తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా... కొన్నేళ్ల నుంచి తన బ్యాచ్ తో కలిసి వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతుండటం ఓ పనిగా పెట్టుకున్నాడు ప్రణీత్ హనుమంతు. ఇక ఈ సమయంలో ఇతడి తీరుపై టాలీవుడ్ హీరో సాయిదుర్గ తేజ్ మొదటిసారి రియాక్ట్ అవ్వడం జరిగింది. వాడి తీరును తీవ్రంగా తప్పుబడుతూ... ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు.దీంతో ఈ విషయం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వీడిపై వీడి ఫ్రెండ్స్ పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వీడి ఆచుకీ కనిపెట్టి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడే వాడిని కోర్టులో హాజరుపరిచారని తెలుస్తుంది. వీడిని, వీడి ఫ్రెండ్స్ ని వీడికి సపోర్ట్ చేసిన వారిని చాలా దారుణాతి దారుణంగా శిక్షించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. వీడి వల్ల సభ్య సమాజం చెడిపోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: