రాజకీయంగా గొడవలు.. కుటుంబంలో చీలికలు..జగన్ కు జరిగిందో కెసిఆర్ కు జరుగుతుందా..?

murali krishna
* రాజన్న వారసుల మధ్య రాజకీయ రగడ
* కెసిఆర్ ఇలాకాలో సరికొత్త సమస్య
* సొంతవారే కయ్యానికి కాలు దువ్వుతున్నారా ?
ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించి చరిత్ర సృష్టించిన జగన్ ఈ సారి ఎన్నికలలో కేవలం 11 సీట్లే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పాయారు.అయితే జగన్ ఓడిపోవడానికి కూటమి ఒక కారణం అయితే కుటంబం లో చీలిక మరొక కారణంగా చెప్పవచ్చు.తన సొంత చెల్లెలు అయిన షర్మిల కాంగ్రెస్ లో చేరి జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసింది.కాంగ్రెస్ పీసిసి అధ్యక్షురాలిగా ఎన్నికైన షర్మిల జగన్ ను ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తుంది.ఈ ఎన్నికలలో జగన్ ను దెబ్బ తీసిన మరో సమస్య బాబాయ్ హత్య ..తన సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందారోపణలు వున్న అవినాష్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో వివేకా హత్యపై న్యాయ పోరాటం చేస్తున్న జగన్ మరో చెల్లెలు సునీత షర్మిలకు మద్దతు తెలిపింది.దీనితో ఇద్దరు చెల్లెల్లు జగన్ పై విమర్శనాస్త్రాలు  కురిపించారు.

జగన్ ఓడిపోవడానికి కుటంబంలో చీలికలు ప్రధాన కారణంగా  చెప్పవచ్చు.అయితే ఈ విషయంలో తన తల్లి విజయమ్మ ఎవరి పక్కన నిలవాలో తెలియక సతమతం అవుతుంది.ఇదిలా ఉంటే తెలంగాణాలో కెసిఆర్ పరిస్థితి మరో రకంగా వుంది.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలన సాగించారు.అయితే ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు అదే సమయంలో కూతురు కవిత లిక్కర్ స్కాం లో అరెస్ట్ కావడంతో తెలంగాణ ప్రజలకు కెసిఆర్ పై నమ్మకం పోయింది.దీనితో కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి వచ్చింది.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.అయితే సీఎం కావాలన్నకేటిఆర్ కల తన చెల్లి వల్ల ఆవిరైపోయింది.దీనితో ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు జరిగిన విధంగానే కెసిఆర్ కుటంబంలో కూడా కలహాలు రానున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: