దీని వెనుక అతిపెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని కూడా ఆమె సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. తన కుమారుడు రాఘవను కాపాడుకునే క్రమంలో... మా గుంట ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి తన భర్తను ఇరికించాడు అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆ స్టేట్మెంట్ తన
భర్త మెడకు చుట్టుకుందని... ఆయనను పోలీసులు అరెస్టు చేసేదాకా వచ్చిందని తెలిపారు. వాస్తవానికి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నీతిపరుడు అని... ఆయన ఎలాంటి తప్పు చేయలేదని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితులలో
అరవింద్ కేజ్రీవాల్ కు ప్రజలు మద్దతు ఇవ్వకపోతే... తన
భర్త లాగా చదువుకున్న వారు ఎవరు కూడా రాజకీయాల్లోకి రావడానికి భయపడతారని తెలిపారు. ఇది ఇలా ఉండగా ఇదే
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట శ్రీనివాసులు కొడుకు రాఘవ... గత సంవత్సరమే అరెస్టు అయ్యాడు. అతనికి బెయిల్ కూడా వచ్చింది. అయితే
వైసీపీ నుంచి... టిడిపిలోకి వచ్చిన మాగుంట... ఎంపిక కూడా గెలవడం జరిగింది.