సాక్షి ఎంత పోరాడినా జగన్ కు మిగిలేది శూన్యమేనా.. వ్యతిరేకత తగ్గే ఛాన్సే లేదా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి మీడియా సపోర్ట్ ఉన్న స్థాయిలో జగన్ కు మీడియా సపోర్ట్ లేదనే మాట వాస్తవం అనే సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన కొన్ని ఛానెళ్లు, పత్రికలు ఎన్నికల ఫలితాల తర్వాత ప్లేటు ఫిరాయించాయి. జగన్ కు అనుకూలంగా సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ మాత్రమే పోరాటం చేస్తున్నాయి
 
సాక్షి ఎంత పోరాడినా జగన్ కు మిగిలేది శూన్యమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి పత్రిక వైసీపీ కరపత్రిక అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. వైసీపీ నేతలు సైతం ఈ పత్రికను చదవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. జగన్ వచ్చే ఐదేళ్లు మీడియా సపోర్ట్ కూడా లేకుండానే తన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంది. ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి కారణాలేంటో జగన్ కు ఇప్పటికే అర్థమై ఉంటాయి.
 
మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్ పై వ్యతిరేకత పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది నేతలు పక్క పార్టీలపై దృష్టి పెట్టడం లేదా పార్టీ మారడం చేస్తున్నారు. అలాంటి నేతల విషయంలో సైతం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. సాక్షి మీడియా సపోర్ట్ జగన్ కు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.
 
సాక్షి పత్రిక కూటమి తప్పులను సమర్థవంతంగా ఎత్తిచూపుతోందనే భావన సైతం ఎవరిలో లేదు. జగన్ సైతం గత ఐదేళ్లలో ఈ పత్రికను పెద్దగా పట్టించుకోలేదు. జగన్ నష్టపోవడానికి కూడా ఇక ఏమీ లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.. 2024 ఎన్నికల్లో ఓటమిపాలైతే వైసీపీకి భవిష్యత్తు లేనట్టేనని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాల్సి ఉంది. వైసీపీ రాష్ట్రంలో పుంజుకోవడానికి జగన్ ఏం చేస్తారనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం. జగన్ కు ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం భారీ షాకేనని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: