జ‌గ‌న్ చుట్టూ కోవ‌ర్టులు... ఎవ్వ‌రిని న‌మ్మ‌ట్లేదా ?

RAMAKRISHNA S.S.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పూర్తి నిర్వేదంలోకి వెళ్లిపోయారు. జగన్ ఎవరితో సరిగా మాట్లాడటం లేదని.. ఏదైనా మాట్లాడిన చాలా డల్ గా కనిపిస్తున్నారని.. సొంత పార్టీకి చెందిన నేతలే చర్చించుకుంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో జగన్ అండ చూసుకుని వైసీపీ వాళ్ళు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయి టీడీపీ వాళ్ళు జనసేన కేడర్‌ను బాగా ఇబ్బందులకు గురి చేశారు. ఆ టైంలో జగన్ తమ పార్టీకి చెందిన నేతలను కంట్రోల్ చేసి ఉంటే పరిస్థితి ఇలా వచ్చేది కాదు. ఎప్పుడైతే ఏపీలో ప్రభుత్వం మారిందో వైసీపీ వాళ్లకు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు చుక్కలు చూపిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓవరాక్షన్ చేసిన వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. ఎవరికి వాళ్లకు ఈ ఐదేళ్లలో ఫ్యూచర్ ఎలా ?ఉండబోతుందో..? 20 రోజుల టీజర్ చెప్పకనే చెప్పేసింది. అందుకే వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్సీలు జిల్లాల్లో టీడీపీకి చెందిన నేతలతో చెట్టాపట్టలేసుకుని తిరుగుతున్నారట. వైసీపీ ఎమ్మెల్సీల బాధ వాళ్లకు ఉంది. దీంతో వైసీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్ చెవిలో వేశారట. జగన్ సైతం ఈ విషయంలో నిస్సహాయత వ్యక్తం చేయడంతో పాటు.. తాను ఏం ? చేయగలన‌ని తిరిగి ప్రశ్నించారట.

అధికారంలో ఉన్నప్పుడు బుజ్జగిస్తేనే ఐదుగురు ఎమ్మెల్సీలు పోయారు. ఇప్పుడు అధికారం లేకుంటే ఎవరు ? మాత్రం ఉంటారని జగన్ తిరిగి ప్రశ్నించినట్టు తెలిసింది. ఓవైపు జగన్ మంత్రి మండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. ప్రభుత్వాన్ని అక్కడ ఇరుకున పెడదామని ప్లాన్లు వేస్తుంటే వాళ్లు మాత్రం టీడీపీతో అంట కాగుతూ తిరిగి జగన్ దగ్గరికి కూడా వెళుతున్నారు. దీంతో వైసీపీ అధినాయకత్వం తన చుట్టూ ఉన్న కొందరి వైసీపీ ఎమ్మెల్సీలు, టీడీపీకి కోవ‌ర్ట్‌లుగా పనిచేస్తున్నారని.. అలాంటివారు ఎవరో ? గుర్తించే పనిలో ఉందట. ఒకవేళ జగన్ ఎవరిని అయినా బెదిరించినా టీడీపీ వాళ్లతో సన్నిహితంగా ఉండవద్దని చెప్పినా ఎవరు ఆగే పరిస్థితి లేదు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం చాలామంది అవసరం అయితే పార్టీని వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: