ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు.. షాకింగ్ విషయం చెప్పిన రేవంత్?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినా పార్లమెంట్ ఎన్నికలు జరిగినా ఈవీఎంల ద్వారానే పోలింగ్ ప్రక్రియ జరుగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన ప్రతిసారి కూడా ఓడిపోయిన పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అంటూ ఆరోపణలు చేయడం.. నేటి రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈవీఎం ట్యాంపరింగ్ అనే పదం తప్పనిసరిగా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 మొన్నటికి మొన్న ఆంధ్రాలో కూటమి పార్టీలు అఖండ విజయాన్ని సాధించిన తర్వాత కూడా ఈవీఎం ట్యాంపరింగ్ కారణంగానే ఇలాంటి ఫలితాలు వచ్చాయని.. జగన్ పార్టీ ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంత దారుణంగా ఓడిపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఎంతోమంది కామెంట్లు చేశారు అన్న విషయం తెలిసిందే. నిజంగానే ఈవీఎం లను ట్యాంపరింగ్ చేయవచ్చా అనే విషయంపై కూడా ఎంతోమంది చర్చించుకుంటూ ఉంటారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదు అని కొంతమంది.. చేసి ఫలితాలను తారుమారు చేయవచ్చు అని ఇంకొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇదే విషయం గురించి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

 ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త హాయ్ టాపిక్ గా మారిపోయాయి. ఈవీఎంలను టాంపరింగ్ చేయవచ్చు. పోలింగ్ రోజు రిజర్వ్ లో ఉండే 15 శాతం యంత్రాలను ట్యాంపరింగ్ చేసి అటు ఇటు మారిస్తే ఎవరికీ తెలిసేందుకు అవకాశం ఉండదు అంటూ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇలా ఈవీఎం ట్యాంపరింగ్ పై చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించి తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: