కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి వరకే ఉంటుంది.. నిజం చెప్పేసిన రేవంత్?

praveen
2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని పార్టీగా ఎదిగింది. అదే సమయంలో ప్రతిపక్షమే లేకుండా చేసుకోవడంలో అటు కేసీఆర్ కూడా సక్సెస్ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా సంపాదించినప్పటికీ ఆ పార్టీలోనే ఎమ్మెల్యేలు అందరిని కూడా కారు పార్టీలో చేర్చుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారాన్ని దక్కించుకోగలిగింది బిఆర్ఎస్.

 కానీ మూడోసారి మాత్రం కనుమరుగవుతుంది అన్న కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగా.. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే రేవంత్ వలస వచ్చిన నేత కావడం.. పార్టీలో అప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న సీనియర్లు ఉండడంతో నేతల మధ్య విభేదాలు వస్తాయని ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ.. ఎప్పుడు చీలికలు వచ్చి ప్రభుత్వం కూలిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉంది.

 ఇలాంటి సమయంలో తమ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుంది అన్న విషయంపై ఇటీవలే ఒక స్పష్టమైన కామెంట్ చేశాడు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పదేళ్లకు ఒకసారి ఏపీలో ఐదేళ్లకొకసారి అధికారం చేతులు మారే ట్రెండు కొనసాగుతుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే 2029 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పకనే చెప్పారు రేవంత్. ఇలా కేసీఆర్ లాగా తమకు అసలు ఎప్పటికీ తిరుగులేదని.. తెలంగాణలో తమ పార్టీ తప్ప మరో పార్టీ అధికారాన్ని దక్కించుకోలేదు అని చెప్పకుండా పాత ట్రెండుకు తగ్గట్టుగానే పదేళ్లపాటు తమ పార్టీ అధికారంలో ఉంటుందని రేవంత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: