
HBD కోటిరెడ్డి : టెక్ ప్రయోగాల పుట్ట.. తెలుగు వెబ్ జర్నలిజంలో సంచలనాల ఇండియా హెరాల్డ్
ఈ క్రమంలోనే కార్డులను ప్రవేశ పెట్టి.. వెబ్ సైట్ల స్థాయికి శిఖరాగ్రస్థాయికి తీసుకువెళ్లారు. అంటే.. ఏదైనా బ్రేకింగ్‌ను న్యూస్‌ను.. చిన్న చిన్న పదాలతో అప్పటికిప్పుడు వెంటనే పోస్టు చేసుకునేలా.. అది కూడా ఫోన్ నుంచి కూడా పోస్టు చేసుకునే సౌకర్యం కల్పించారు. తెలుగు వెబ్ జర్నలిజం చరిత్రలో బ్రేకింగ్ ముందుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ కార్డు సిస్టమ్‌ను ఇండియా హెరాల్డ్ మాత్రమే ప్రవేశ పెట్టింది. విచిత్రం ఏంటంటే తర్వాత హెరాల్డ్‌ను ఫాలో అవుతూ దిగ్గజ మీడియా సంస్థలు కూడా కార్డులు వేస్తున్నాయి.
కోటిరెడ్డి తనకున్న ఐటీ నాలెడ్జ్ వినియోగించుకుని.. ఇండియా హెరాల్డ్ స్థాయిని పెంచారు. ఇక, కార్డుల విషయంలో పోటీ తత్వాన్ని పెంచుతూ.. ఆథర్స్‌కు బహుమానాలు కూడా ఇచ్చారు. ప్రతి రోజు పోర్టల్లో వేసే కార్డులలో ఉత్తమ కార్డుగా ఎంపికైన వాటికి 1116/- రూపాయలు ఇస్తూ.. ప్రోత్సహించారు.
ఇక, వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దే క్రమంలో ఆథర్స్‌కు మరింత వెసులుబాటు కల్పించారు. ఎక్కడ ఉన్నా.. ఏ మాధ్యమం.. అంటే.. డెస్క్‌టాప్, లాప్ టాప్.. లేదా మొబైల్ నుంచి కూడా ఆర్టికల్స్‌ను ఇండియా హెరాల్డ్‌లో పోస్టు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
దీనివల్ల.. ఆథర్స్ మధ్య పోటీ తత్వం పెరిగి.. మరింత నాణ్యమైన వార్తలు.. వివిధ అంశాలకు సంబంధించిన వార్తలు కూడా ప్రజలకు చేరువ అవుతాయనే లక్ష్యంతో చేసిన ప్రయోగాలు.. హెరాల్డ్‌ను సమున్నత స్థాయిలో నిలబెడుతున్నాయడంలో సందేహం లేదు