అదేంటి.. రాజాసింగ్ ను ఈటెల అంత మాట అనేసాడు?
ఈ క్రమంలోనే ఇలా తెలంగాణ నుంచి ఎంపీలుగా ఎన్నికైన బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి కీలకమైన నేతలకు కేంద్రంలో మంత్రి పదవులు కూడా దక్కడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇక కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కిన నేపథ్యంలో.. ఆయనను తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పదవి నుంచి తప్పించి కొత్తవారిని నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో తెలంగాణ కొత్త బిజెపి అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. కాగా బిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వచ్చి.. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ కే ఇలా పార్టీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది అంటూ ఎంతో మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి సమయంలో వలస వచ్చిన నేతలకు కాదు ఎన్నో రోజుల నుంచి పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వారికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వాలి అంటూ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టుపట్టారు. దీంతో ఇలా అధ్యక్ష పదవి కోసం బిజెపిలో ఒక చిన్న సైజు వార్ నడుస్తుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చీప్ గా ఫైటర్ కావాలంటున్నారు. ఏ ఫైటర్ కావాలి స్ట్రీట్ ఫైటర్ కావాలా లేకపోతే రియల్ ఫైటర్ కావాలా? ఐదుగురు ముఖ్యమంత్రిలతో కొట్లాడా.. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలి. వీధుల్లో పోరాడే వారు కాదు అంటూ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. అయితే రాజాసింగ్ ఈటలను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఇక ఇప్పుడు అటు రాజా సింగ్ పేరు ప్రస్తావించకపోయిన ఈటెల ఆయనను ఉద్దేశించే ఇలాంటి కామెంట్లు చేశారంటూ అందరూ చర్చించుకుంటున్నారు.