జగన్ పై అదే నమ్మకం.. అదే గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు..??

Suma Kallamadi
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి క్యాడర్ ఇప్పటికే స్ట్రాంగ్ గా ఉందంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆయన్ని నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారా అంటే ఉన్నారని స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. జగన్ వీరాభిమానులు ఇప్పటికీ లాయల్‌గా ఉన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు అందరూ కూడా యాక్టివ్ గానే ఉన్నారు. అయితే వీరందరిలో జగన్ పై ఉన్న నమ్మకం ఒకటే అని తెలుస్తోంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు నేత్రత్వంలో ఏర్పాటైన టీడీపీ కూటమి చాలా హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయలేకపోతే ప్రజలు వైసీపీ ప్రభుత్వమే బెటరని ప్రజలు అనుకోవచ్చు.
వైఎస్ జగన్ పార్టీలకు అతీతంగా, కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అమలు చేశారు. చంద్రబాబు కూడా అలానే చేయాల్సి ఉంటుంది లేకపోతే ప్రజల సంక్షేమాన్ని చూసుకోగల సమర్థవంత నాయకుడు ఒక్క జగన్ మాత్రమే అని ప్రజలు రియలైజేషన్ కి వస్తారు. అయితే జగన్ పోయినసారి కోటి 40 లక్షల మంది కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందజేశారు.
ఇంతమందికి లబ్ధి చేకూర్చినా ఓటు వేసిన వారి తక్కువే. అందువల్ల చంద్రబాబు నాయుడు పథకాలను అమలు చేసిన పెద్దగా ఒరిగేది ఏమీ లేదనే ఒక అభిప్రాయంలో ఉండవచ్చు. మళ్లీ చంద్రబాబు ముందు ప్రవేశపెట్టిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్తే చాలు ఎక్కువ వస్తాయి కదా అని నమ్మేసి ఆయనకే ఓటు గుద్దుతారు. చెప్పినట్లే అన్నిటిని నెరవేరుస్తారా లేదా అనేది ప్రజలు పట్టించుకోరు అసలు పార్టీ ఏమి ఇస్తుందో అది ముందుగా పట్టించుకుంటారు. అందుకే ఇంతకుముందు చంద్రబాబు కోటి ఉద్యోగాలు అని చెప్పడం నిరుద్యోగ భృతి అని చెప్పడం ఇవన్నీ చేయకపోయినా ఆయననే మళ్లీ నమ్మారు.
చెప్పిన మాట నెరవేర్చిన ఏకైక నాయకుడిగా జగన్ భారతీయ రాజకీయ చరిత్రలో నిలిచిపోతారు. అలా ఉన్నందుకు ప్రజలు ఓడించడం విస్మయకరం. మళ్లీ ఆయనను నమ్మితే మంచి రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికీ జగన్ చేసింది 100% కరెక్ట్ అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: