కూటమి దెబ్బ: వైసీపీ మరో 10 ఏళ్లు ఆగాల్సిందేనా?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అత్యంత దారుణంగా ఎవరు ఊహించని విధంగా ఓడిపోయింది. తెలుగుదేశం అలాగే జనసేన పార్టీలు కూడా... ఇంత దారుణంగా వైసిపి ఓడిపోతుందని అనుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం.... 11 శాసనసభ్యులను మాత్రమే గెలుచుకోగలిగింది జగన్మోహన్ రెడ్డి పార్టీ. వై నాట్ 175 నినాదంతో ఏపీ ఎన్నికలకు వెళ్లిన జగన్ పార్టీ.. ఎన్నికల్లో మాత్రం బొక్క బోర్లా పడింది.
 ఇక ఆటో తెలుగుదేశం కూటమికి 164 స్థానాలు వచ్చాయి. జగన్కు 50 నుంచి 60 సీట్లు వస్తాయని తెలుగుదేశం కూటమి సభ్యులు అంచనా వేశారట. కానీ వైసీపీ పార్టీపై ఏపీ ప్రజలకు  పీకలదాకా కోపం ఉన్న నేపథ్యంలోనే... 11 స్థానాలు ఇచ్చారని.. కూటమి సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు... మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలంటే దాదాపు పది సంవత్సరాలు ఆగాల్సిందేనని చెబుతున్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే... ఏపీని విధ్వంసం చేస్తాడని...  తెలుగుదేశం కూటమి సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
ఆ పది సంవత్సరాల తర్వాత కూడా.. వైసిపి పార్టీకి ఉన్న ఓటు జనసేన, భారతీయ జనతా పార్టీల వైపు వెళ్లే ఛాన్స్ ఉందని కూడా వారే అంచనా వేస్తున్నారు. అప్పుడు వైసిపి పార్టీ ఉంటే.. అధికారంలోకి వస్తుంది...  లేకపోతే జగన్ కెరీర్ క్లోజ్ అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే అచ్చం తెలుగుదేశం పార్టీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. 2019 ఎన్నికల్లో గోరంగా ఓడిన తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చాలామంది ట్రోల్ చేశారు.
 కానీ చంద్రబాబు ఎత్తుగడలతో మళ్ళీ ఏపీలో అధికారం చేపట్టింది టిడిపి పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా... ఈ ఐదు సంవత్సరాల పాటు... ఏపీ ప్రజల మధ్య ఉంటూ... తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలి. ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేయాలి. అప్పుడు కచ్చితంగా వైసీపీ పార్టీ.. పికప్ అందుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా ఐదు సంవత్సరాల సమయంలోనే వైసిపి అధికారం చేపట్టడం ఖాయమని అంటున్నారు. పార్టీ అధినేత స్ట్రాంగ్ గా ఉంటే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: