ఏపీ: బిజెపిలోకి వైసీపీ ఎంపీ.. ఒక్క దెబ్బతో క్లారిటీ..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సైతం  వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకి పరిమితమై ఘోరమైన పరాజయాన్ని మూట కట్టుకుంది. ఈ సమయంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు మండలాలలో బలంగా ఉన్న ఎమ్మెల్సీలను కూడా కాపాడుకోవడం ఇప్పుడు వైసీపీ పార్టీకి ఒక సవాలుగా మారింది. జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగద్దు కేసులకు భయపడవద్దండి అంటూ తమ నేతలకు తెలియజేశారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత జగన్ గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఉన్న ఎమ్మెల్సీ లతో వరుసగా భేటీ అయ్యారు.

ఈ క్రమంలోనే తమ పార్టీ నేతలకు సూచిస్తూ వైసిపి ఎంపీలకు బిజెపి పార్టీ గాలం వేసే అవకాశం ఉందని ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగదండి అంటూ తెలిపారు. అలాగే వైసిపి ఎమ్మెల్సీలను టిడిపి లాక్కొని అవకాశం ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వైసిపి తరఫున అరకు నుంచి గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత అనంతరం బిజెపిలో చేరారు. ఇప్పుడు తాజాగా మరొక వైసీపీ ఎంపీ తనుజారాణి విషయంలో కూడా ఇదే జరగబోతోంది అనే విషయం ఎక్కువగా వినిపిస్తోంది.

వైసిపి నుంచి బిజెపి పార్టీలోకి వెళ్లే తొలి ఎంపీ ఈమె అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో అరకు ఎంపీ తనుజారాణి స్పందిస్తూ.. ఈ ప్రచారాలపైన క్లారిటీ ఇస్తూ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపైన తన ట్విట్టర్ నుంచి స్పందిస్తూ ఒక్కమాటలో అదిరిపోయే సమాధానాన్ని తెలిపింది.."ప్రాణం ఉన్నంతవరకు జగనన్నతోనే మా ప్రయాణం అంటూ ఆమె ఒక ట్విట్ చేయడం జరిగింది. దీంతో ఆమె పార్టీ మారబోతుందని విషయం పైన గట్టి క్లారిటీ ఇచ్చేసింది. వైసీపీ పార్టీలోనే కొనసాగుతానంటూ కూడా తెలియజేసింది.. ఎస్టీ రిజర్వుడు స్థానంలో అరకు లోక్సభ స్థానం నుంచి మొదటిసారి వైసీపీ టికెట్ దక్కించుకున్న ఈమె బీజేపీ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి గీతా పైన 50 వేల ఓట్లకు పైగా గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: