జగన్: వైసిపి కార్యకర్తలకు బ్యాడ్ న్యూస్.. కోర్టు లో షాక్..!

Divya
ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. గత కొన్ని ఏళ్లుగా అక్రమాస్తుల కేసుల చిక్కుకోవడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కేసులు తెలంగాణ కోర్టులో ఉన్నవి. ఆయన గతంలో ప్రతివారం కూడా శుక్రవారం పూట్ల హాజరవుతూ ఉండేవారు. ప్రతిపక్ష నాయకుడుగా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా ప్రతి శుక్రవారం కూడా కోర్టులకు వెళ్ళొస్తూ ఉండేవారు. గురువారం మధ్యాహ్నం కి పాదయాత్ర ముగించుకొని వెళ్లి శుక్రవారం రోజున కోర్టు పనులు చూసుకొని శనివారం మధ్యాహ్నానికి వచ్చేవారు.

ఆ తర్వాత తను ముఖ్యమంత్రి అయ్యాక.. ముఖ్యమంత్రి విధులలో ఉన్నాను కాబట్టి ఎక్స్టెన్షన్ వంటివి తీసుకోవడం జరిగింది.. అప్పుడు మినహాయింపు కూడా కోర్టు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సారి కూడా కోర్టుకు వెళ్లలేదు.. రెండు మూడుసార్లు అటెండ్ కావాలని ఉత్తర్వులు వచ్చినప్పుడు కూడా.. ముఖ్యంగా తన మీద జరిగినటువంటి కేసులో సాక్షిగా వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా తను వెళ్లలేదు.. ఈ విషయం మీద కూడా వివాదం జరిగింది. ఇక మీదట కోర్టు బాట జగన్ పట్టాల్సి ఉన్నదని చెప్ప వచ్చు.

తాజాగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని హైదరాబాద్ కోర్టులో వేసినటువంటి ఫిటీషన్.. కోర్టు కొట్టి వేసింది. దీంతో ఇక పైన జగన్మోహన్ రెడ్డి విచారణకు రెగ్యులర్గా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ విచారణ రోజువారిగా జరపడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే రోజు కోర్టుకి అటెండ్ కావలసి ఉంటుంది. అయితే దీనిమీద మళ్లీ హైకోర్టుకు వెళ్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.. అయితే ఇదంతా కూడా కేవలం కావాలని అటు టిడిపి కాంగ్రెస్ ప్రభుత్వం చేయిస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: