కక్ష సాధింపు వద్దన్న ఒక్క మాట.. బాబోరిపై నమ్మకమే కాదు.. గౌరవము తెచ్చింది?

praveen
ఇటీవల ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈసారి టిడిపి జనసేన బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని మరి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగగా..  ఏకంగా 164 స్థానాలలో కూటమి అఖండ విజయాన్ని సాధించింది.అయితే టిడిపి పార్టీకి సొంతంగా అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన దానికంటే ఎక్కువ సీట్లలోనే విజయం దక్కింది. అయితే ఇటీవల కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ చంద్రబాబు ఇక కూటమిలోని మిగతా పార్టీలతో ఎలా ఉంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ టిడిపికి ఉండడంతో ఇక జనసేన, బిజెపి పార్టీలను పక్కకు పెట్టే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో సమన్యాయం అనే విధంగానే పాలన సాగించేందుకు సిద్ధమైన చంద్రబాబు కూటమిలోని జనసేన బిజెపి పార్టీలకు సమానంగానే మంత్రి పదవులు కీలక పదవులను కట్టబెట్టారు. అదే సమయంలో టిడిపి కూటమి అధికారంలోకి రాగానే అందరిలో ఒకే ప్రశ్న మిగిలింది. గతంలో వైసిపి అధికారంలోకి ఉన్నప్పుడు అందరినీ టార్గెట్ చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెట్టింది. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎవరిని వదలలేదు ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని ఎంతోమంది అనుకున్నారు.

 కానీ ఊహించని రీతిలో చంద్రబాబు చెప్పిన ఒక్క మాట అటు బాబోరి పాలన పైనే కాదు.. ఆయనపై కూడా ఏపీ ప్రజలందరిలో గౌరవాన్ని తెచ్చి పెట్టింది  గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనల్ని ఎంత ఇబ్బందులకు గురిచేసిన పరవాలేదు.. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని.. ఎవరు కూడా కక్ష సాధింపులకు పాల్పడవద్దు.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజాపాలన మాత్రమే సాగాలి. ప్రజాస్వామ్య బద్దంగా మాత్రమే కార్యకర్తలు నేతలు నడుచుకోవాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ఏకంగా తనను జైలుకు పంపి ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైసీపీపై పగ తీర్చుకోవాలని ఆలోచించకుండా.. కక్ష సాధింపు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అనే విషయాన్ని చెప్పి.. ఇక ఆంధ్ర ప్రజల మనసుని గెలుచుకోగలిగారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: