ఏపీ: కూటమికి పోతిన మహేష్ సూటి ప్రశ్న.. జవాబు చెప్పేరా..?

Divya
రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది.. ముఖ్యంగా మంత్రులుగా స్థానం దక్కించుకున్న వారికి శాఖలు కూడా కేటాయించడంలో ఎవరి పనులలో వారు కసరతులు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికలకు ముందు జనసేన నుంచి వైసీపీ పార్టీలోకి వెళ్లిన పోతిన మహేష్ తాజగా కూటమి పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు మొదటి సంతకం సామాజిక మోసం చేశారని కూడా తెలియజేశారు.

అసలు చంద్రబాబు కూటమిలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. బీసీలను ఎస్సీ ఎస్టీలను ముస్లింలను సైతం అగౌరపరిచారు అంటూ పోతన మహేష్ వెల్లడించారు. 2014లో ఉప ముఖ్యమంత్రిగా చినరాజప్పని మరొకటి కృష్ణమూర్తికి ఇచ్చారు. వీరిద్దరూ కాపు గౌడ సామాజిక వర్గాలకు చెందిన వారే అంటూ తెలిపారు. 2019లో అధికారంలో ఒకే వచ్చిన జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూనే పది మందికి ఉపముఖ్యమంత్రి పదవులను ఇచ్చారని బీసీ ,ఎస్సీ, ఎస్టీ ,కాపు ,మైనార్టీ వర్గాలకు కూడా ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారంటూ మహేష్ వదిన తెలియజేశారు. గతంలో జగన్ చేసిన దానికంటే మీరు మిన్నంగా పనిచేయాల్సి ఉంటుంది అంటూ తెలిపారు.

అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ వర్గాలకు కూడా ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అలా చేయలేదంటూ ఫైర్ అయ్యారు మహేష్ పొతిన. చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడు పోరాడి కేసులు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావాలని పదవులు వచ్చే సమయానికి మాత్రం వారు గుర్తుకురారంటూ ప్రశ్నించారు.. ఇదేనా మీరు చేసేటువంటి సామాజిక న్యాయం అంటూ తెలియజేశారు మహేష్ పోతిన. మరి ఉపముఖ్యమంత్రి పదవి పై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి అలాగే ఈ ఉపముఖ్యమంత్రి పదవి విషయంలో తనకు సమాధానం చెప్పాలి అంటూ కూడా చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఎవరు స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: