అన్నా క్యాంటీన్ల కోసం ఆ సంస్థతో ఒప్పందాలు...కొత్త ధరలు ఇవే ?

Veldandi Saikiran
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఏపీ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై కీలక ఆదేశాలు ఇచ్చారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగా రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం, టిఫిన్లు అందిస్తామని శుభవార్త చెప్పారు. 203 అన్న క్యాంటీన్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేసిన మంత్రి నారాయణ...  వీటిల్లో చాలా వరకు భవనాల నిర్మాణం జరిగిందని తెలిపారు.

 
అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని.... గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లని వేరే అవసరాలకు వినియోగించుకుందని వివరించారు. కండిషన్ లో లేని నాటి అన్న క్యాంటీన్ల భవనాలను రెన్నోవేట్ చేయాలని ఆదేశించామని వివరించారు ఏపీ మంత్రి నారాయణ. రూ. 73కు మూడు పూటల భోజనం పెడతామని ఇస్కాన్ చెప్పిందని వెల్లడించారు. కానీ మేం పేదలను దృష్టిలో పెట్టుకుని సబ్సిడీపై రూ. 5 భోజనం పెట్టామన్నారు ఏపీ మంత్రి నారాయణ. రూ. 58 మేం ఇస్కానుకు నాటి టీడీపీ ప్రభుత్వం తరపున చెల్లించిందని గుర్తు చేశారు.

 
అప్పట్లో రోజుకు 2.25 లక్షల మంది భోజనం చేసేవారని వెల్లడించారు. టీడీపీ హయాంలో 4.25 కోట్ల మంది అన్న క్యాంటీన్లను సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఇస్కాన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు ఏపీ మంత్రి నారాయణ. ఇస్కాన్ కే అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యత  ఇవ్వొచ్చా..? లేదా.. వేరే టెండర్లను పిలవాలా..? అనే అంశంపై చర్చిస్తున్నామన్నారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు ఏపీ మంత్రి నారాయణ.

 
తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించగలమని ఇస్కాన్ ప్రతినిధులు చెప్పారన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇస్కాన్ సంస్థకున్న సెంట్రలైజ్డ్ కిచెన్స్ కూడా ఇతర రాష్ట్రాలకు  తరలివెళ్లాయని వివరించారు. అలాగే, ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంది...గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేవారని ఫైర్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: