బాబు కేబినెట్‌: ఈ ఆరుగురు సిక్స‌ర్ కొట్టేశారుగా...!

praveen
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే చంద్రబాబుతో పాటు మరో 25 మంది మంత్రులుగా ఇదే వేదికపై ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆయా మంత్రులకు ఏయే శాఖలు కేటాయించబోతున్నారు అనే విషయంపై ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది అన్న విషయం తెలిసిందే. కాగా నిన్ననే ఇలా శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ.. అలా జరగలేదు. అయితే ఇక ఇప్పుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా శాఖల కేటాయింపు పూర్తయింది. ఇక ఆ వివరాలను టిడిపి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

 అయితే సాధారణంగా రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వాళ్లకు మాత్రమే మంత్రి పదవులు తగ్గడం చూస్తూ ఉంటాం. ఏకంగా మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినవారు మంత్రి పదవి దక్కించుకుంటూ ఉంటారు. కానీ చంద్రబాబు ఇందుకు భిన్నంగా మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి కూడా తన క్యాబినెట్లో అవకాశం కల్పించారు. అయితే మొదటిసారి గెలిచి క్యాబినెట్ లోకి వచ్చిన వాళ్లకి ఏదో చిన్న చిన్న శాఖలను మాత్రమే అప్పగించే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేశారు. కానీ ఇటీవల శాఖల కేటాయింపు పూర్తయిన తర్వాత వివరాలు చూసుకొని అందరూ షాక్ అవుతున్నారు.

 వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, సత్య కుమార్ యాదవ్  లాంటివారు మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే వీళ్లకు కీలకమైన శాఖలు దక్కాయి అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే క్రికెట్లో మొదటి మ్యాచ్ ఆడి మొదటి బంతికే సిక్సర్ కొట్టినట్లు ఇక వీళ్ళు మొదటిసారి గెలిచి ఇక అప్పుడే రాజకీయాల్లో సిక్సర్ కొట్టేశారు. ఇక వీళ్ళ శాఖల వివరాలు చూసుకుంటే..
 వంగలపూడి అనిత - హోంశాఖ తో పాటు విపత్తు నిర్వహణ శాఖ
 నిమ్మల రామానాయుడు - జల వనరుల, అభివృద్ధి శాఖ .
 అనగానీ సత్యప్రసాద్ - కీలక శాఖ అయిన రెవిన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ.
 కొట్టి రవికుమార్ - విద్యుత్ శాఖ కేటాయించారు.
 సత్య కుమార్ యాదవ్ - వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ దక్కింది.
 బీసీ జనార్దన్ రెడ్డి -  రోడ్లు, భవనాలు, మౌలిక వసతుల శాఖను కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: