ఏపీ అసెంబ్లీ హీరోలు: అసెంబ్లీని దద్దరిల్లించనున్న భూమా అఖిలప్రియ..??

Suma Kallamadi
భూమా నాగి రెడ్డి, శోభా నాగి రెడ్డి దంపతుల కూతురు భూమా అఖిల ప్రియ కేవలం 27 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 2014 ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఘన విజయం సాధించారు. తరువాత 2016లో, తన తండ్రి నాగి రెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. చంద్రబాబు ప్రభుత్వంలో పర్యాటక, తెలుగు భాష, సాంస్కృతిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2019లో టీడీపీ నుంచి ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రరెడ్డి చేతిలో ఓడిపోయారు.
అయితే 2024లో బిజేంద్రరెడ్డిని 12,037 ఓట్ల మెజార్టీతో చిత్తుగా ఓడించారు. దాంతో ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అయ్యింది. రాజకీయాల్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే భూమా అఖిలప్రియ తన గొంతుకను చాలా స్పష్టంగా వినిపించేవారు. అసెంబ్లీలో కూడా ధైర్యంగా మాట్లాడేవారు. జగన్ లాంటి పవర్‌ఫుల్ లీడర్స్‌ను కూడా ఆమె అసెంబ్లీలో కడిగి పారేసిన సందర్భాలు ఉన్నాయి. నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా చెప్పగల మనస్తత్వం ఆమెది.
దాదాపు 10 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆమె బాగా రాటుదేలారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి అనేకమైన అంశాలపై కూడా ఆమె మంచి అవగాహన సంపాదించారు. ఈసారి అసెంబ్లీలో ఆమె హీరో అవతారని చెప్పడంలో సందేహం లేదు. తను నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు ఏపీ అంతటా ఉన్న సమస్యలను కూడా ఆమె అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. చంద్రబాబు కూడా ఆమెను బాగా ప్రోత్సహించవచ్చు. ఎప్పటినుంచో భూమా ఫ్యామిలీకి బాబు బాగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.  
టీడీపీ అసెంబ్లీ సీట్లలో చాలామంది ఆడవారి పోటీ చేసి విజయం సాధించారు. వారందరిలో భూమా అఖిలప్రియ  చాలా డేర్ అండ్ డాషింగ్ గా ఉంటారు. అసెంబ్లీలో వైసిపి పాలనలో జరిగిన అవినీతిని అక్రమాలను ఆమె నిర్భయంగా బయటపెట్టే అవకాశం ఉంది. చూడాలి ఈసారి బాగా అనుభవం పొందిన ఆమె అసెంబ్లీలో ఎలా మాట్లాడతారో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: