రెండు లక్ష్యాలతో జగన్ జిల్లాల పర్యటన..?

Pulgam Srinivas
వై సి పి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో మేము 2019 వ సంవత్సరం 151 అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నాం. ఈ సారి అంతకన్నా ఎక్కువ స్థానాలను దక్కించుకుంటాం. మేము 2019 ఎలక్షన్లు జరిగిన తర్వాత రిజల్ట్ కి ముందు ఆ మాట చెబితే ఎవరూ నమ్మలేదు. కానీ అదే జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి భారీ రిజల్ట్ రాబోతుంది అని జగన్ చెప్పుకొచ్చాడు. దానితో వై సి పి నేతలు , కార్యకర్తలు , ఆ పార్టీ అభిమానులు కూడా చాలా ఆనందపడ్డారు. ఇక జూన్ 4 వ తేదీన రిజల్ట్ వచ్చింది.

ఈ రిజల్ట్ వై సి పి పార్టీ కి పూర్తి వ్యతిరేకంగా వచ్చింది. ఈ పార్టీ కి ఈ ఎన్నికలలో కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. దానితో ఈ పార్టీ నేతలు , కార్యకర్తలు , ఈ పార్టీని అభిమానించే వ్యక్తులు చాలా డీలా పడిపోయారు. అలా డీలా పడిపోయిన వ్యక్తులందరికీ ధైర్యం చెప్పేందుకు జగన్ జిల్లాల పర్యటన మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ఈ పార్టీ కీలక నేతలు రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుండి ఈ పర్యటన ఉండబోతున్నట్లు , ఈ పర్యటనలో భాగంగా మొదట ఈ పార్టీ నేతలు , కార్యకర్తలు , అభిమానులను కలిసి ఓటమి వల్ల అధైర్య పడకూడదు అని , గతంలో కూడా ఓటములు వచ్చాయి.

వాటి తర్వాత అద్భుతమైన విజయాలు వచ్చాయి. అలాంటి విజయమే మరికొన్ని రోజుల్లో రాబోతుంది అని వారికి ధైర్యం చెప్పబోతున్నట్లు ,  ఇక ఈ మధ్య కాలంలో కొంత మంది వై సి పి పార్టీకి సంబంధించిన వ్యక్తులపై కొన్ని దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అలా దాడుల్లో బాధితులైన వారిని పరామర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికలు పూర్తి అయ్యి రిజల్ట్ వచ్చిన అతి తక్కువ కాలంలోనే జగన్ ఇలాంటి పర్యటన మొదలు పెట్టుకున్నాడు అంటే ఇది చాలా రోజుల పాటు ఇలాగే కొనసాగనున్నట్లు జగన్ ఎక్కువ శాతం జనాల్లోనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: