ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ వీరవిధేయులు.. ఈ ప్రశ్నలకు జవాబులున్నాయా?
వైసీపీ ఓటమికి కారణాలేంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉచిత ఇసుకను రద్దు చేయడం, మద్యం రేట్లు పెంచడం, కొత్త బ్రాండ్లను తీసుకొనిరావడం, నవరత్నాలతో పోలిస్తే సూపర్ సిక్స్ హామీలు మెరుగ్గా ఉండటం, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, పట్టాదారు పాస్ బుక్స్ పై జగన్ ఫోటోలు, ఏపీలో అభివృద్ధి జరగకపోవడం, చేసిన అభివృద్ధిని వైసీపీ ప్రచారం చేసుకోలేకపోవడం, గ్రామ వార్డ్ సచివాలయ సేవల విషయంలో ప్రజల్లో సంతృప్తి లేకపోవడం వైసీపీకి మైనస్ అయ్యాయని ఆ పార్టీ అభిమానులే చెబుతున్నారు.
ఒకే సమయంలో 1,26,000 ఉద్యోగాలు కల్పించి తర్వాత అదే స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడం, వైసీపీ కార్యకర్తల అసంతృప్తిని జగన్ సర్కార్ పట్టించుకోకపోవడం, గ్రామాల్లో సమస్యలను పరిష్కరించకపోవడం, కొత్త రోడ్లను నిర్మించకపోవడం, చెత్త పన్ను పెంచడం, విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగడం, నిధులు మంజూరు చేయకపోవడం వైసీపీకి మైనస్ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మంత్రులు కేటాయించిన శాఖల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇతర పార్టీల నేతలను వైసీపీ నేతలు అసభ్యంగా దూషించడం, భూ సర్వే సమస్యలను అధికారులు పరిష్కరించకపోవడం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను జగన్ పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, మూడు రాజధానుల వల్ల ప్రజల్లో గందరగోళానికి తెరలేపడం వైసీపీ ఓటమికి కారణాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కామెంట్లకు వైసీపీ నేతలు ఎవరైనా జవాబులు ఇస్తారేమో చూడాల్సి ఉంది.