శాఖలు-సవాళ్లు: చంద్రన్న తలలో నాలుక అచ్చెన్న..!

frame శాఖలు-సవాళ్లు: చంద్రన్న తలలో నాలుక అచ్చెన్న..!

Pandrala Sravanthi
•చంద్రబాబు నమ్మిన బంటు
•కీలక శాఖ వరిస్తుందా.?

•టెక్కలి అభివృద్ధే లక్ష్యమా.?

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా  ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు.  అలాంటి ఈ తరుణంలో టిడిపిలో సీనియర్ నేత అయినటువంటి అచ్చెన్నాయుడుకు కూడా  కేబినెట్ లో చోటు లభించింది. ఈ అచ్చెన్నాయుడు ఎవరు, ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ టిడిపిలో కింజారపు కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దివంగత నేత ఎర్రన్నాయుడు టిడిపిలో కొన్నాళ్లపాటు చక్రం తిప్పిన నాయకుడు. ప్రస్తుతం ఆయన సోదరుడు అచ్చెన్నాయుడుకు కీలక నేతగా ఎదిగారు. టెక్కలి నియోజకవర్గం అచ్చెన్నాయుడు చంద్రబాబుకు ఒక్క ఫోన్ కాల్ నేతగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఈయన ఈ ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు. అలాంటి అచ్చెన్నాయుడు కేబినెట్ లో మరోసారి చోటు కల్పించారు చంద్రబాబు నాయుడు.


1971 మార్చి 26న  శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో పుట్టిన అచ్చెన్నాయుడి తల్లిదండ్రులు దాలినాయుడు,కళావతి నాయుడు. ఈయన విద్యాభ్యాసం అంత విశాఖ జిల్లాలోనే కొనసాగింది. విద్యార్థి దశ నుంచి రాజకీయాలకు ఆకర్షితులైన అచ్చెన్నాయుడు,  దివంగత మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి హరిచ్చంద్రపురం నుంచి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఈయన, ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో ఈ కుటుంబానికి కంచుకోటగా మారిపోయింది. 1996 బై ఎలక్షన్స్ లో మొదటిసారి పోటీ చేసిన అచ్చెన్నాయుడు విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004లో కూడా వరుస విజయాలు సాధించారు. 2009 నియోజకవర్గాల పునర్వివిభజనలో భాగంగా ఈ హరిచ్చంద్రపురమే టెక్కలి నియోజకవర్గంగా రూపు చెందింది. ఇదే సంవత్సరం టెక్కలి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విడిపోయిన తర్వాత 2014లో టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అచ్చెన్న.


ఈ టైంలోనే తన కేబినెట్ లోకి చంద్రబాబు తీసుకున్నారు. అప్పటి నుంచి జిల్లాలోనే కీలక లీడర్ గా ఎదిగినటువంటి అచ్చెన్నాయుడు చంద్రబాబు తలలో నాలుకగా మారారు. ఆ టైంలో ఈయనకు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో టెక్కలి నుంచి మరోసారి విజయాన్ని అందుకున్నారు. అదే సమయంలో టిడిపి ప్రతిపక్ష హోదాలో ఉన్నా కానీ అచ్చెన్నాయుడు ఏమాత్రం తగ్గకుండా  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శిస్తూ వచ్చారు. ఆయన ధైర్యాన్ని గుర్తించినటు వంటి చంద్రబాబు  ఏపీ టిడిపి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నటువంటి అచ్చెన్నాయుడు 2024 ఎన్నికల్లో టెక్కలి నుంచి మరోసారి గెలుపొందారు. ఈసారి కూడా తన క్యాబినెట్లో స్థానం కల్పించారు చంద్రబాబు నాయుడు. అయితే ఈసారి ఆయనకు కీలకమైన శాఖలో పదవి ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈయనకు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ  మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఆయనను ఈ శాఖ వరిస్తుందా లేదంటే మరొకరికి వెళ్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: