రోజా పార్టీ మారబోతుందా.. జగన్ కు షాక్ తప్పదా?

praveen
అదుపుతప్పిన కారు అదుపులో లేని నోరు ఎప్పటికీ చేటే అని చెబుతూ ఉంటారు పెద్దలు  ఎందుకంటే మాటే బంధాలను దగ్గర చేస్తుంది. ఆ మాటే శత్రువులను పెంచేస్తుంది. ఆ మాటే చివరికి ఎన్నో దారుణాలకు కూడా కారణం అవుతుంది. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కొన్ని కొన్ని సార్లు పర్యవసానాలు అనుభవించక తప్పదు. అయితే ఇక ఇప్పుడు మొన్నటి వరకు మంత్రి హోదాలో ఉండి తనకు తిరుగులేదు అని ఆలోచనతో ఉన్న మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఇలాంటి ప్రస్తుత ఏర్పడిందా అంటే ఎవరిని అడిగినా అవును అనే సమాధానమే చెబుతున్నారు.

 తమకు ఏదో మంచి చేస్తారు అని నమ్మి ప్రజలు ఆమెను గెలిపించారు. ఇలా గెలిపించిన నాటి నుంచి ఆమె జగన్ భజన తప్ప ఇంకేం చేయలేదు అనే విమర్శలు ఎన్నోసార్లు వచ్చాయి. టిడిపి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆర్కే రోజా వ్యక్తిగత కారణాలతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి వైయస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్లో చేరింది. ఇక ఆ తర్వాత వైయస్ మరణానంతరం  జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించిగా.  రోజా కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి వైసిపి కండువా కప్పుకుంది. అయితే 2014లో వైసీపీ తరఫున పోటీ చేస్తే జగన్ పార్టీ ఓడిపోయిన రోజా మాత్రం గెలిచింది. 2019 ఎన్నికల్లోను ఆమె విజయానికి తిరుగులేకుండా పోయింది.

 2019లో ఇక జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో రోజాకి పర్యాటక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు దక్కాయి  అయితే ఇలా వైసిపి అధికారంలోకి రాగానే తన నోటికి పని చెప్పింది రోజ. కొన్ని కొన్ని సార్లు సాటి మహిళలే అసహ్యించుకునేలా మాట్లాడింది అనే విమర్శలు కూడా ఉన్నాయి. పవన్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఇలా అందరిని టార్గెట్ చేస్తూ ఎన్నోసార్లు నోరు పారేసుకుంది  చివరికి 2024 ఎన్నికల్లో రోజాకి టికెట్ ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలే జగన్ను కోరే స్థాయికి పడిపోయింది. అయినప్పటికీ జగన్ రోజా కి టికెట్ ఇచ్చారు. చివరికి నగరి నుంచి ఆమె దారుణ పరాజయం చవిచూసింది.

 అయితే ఇప్పుడు రోజా పార్టీ మారాలనుకుంటున్నట్టు ఒక ప్రచారం తెరమీదికి వచ్చింది. కానీ రోజా పార్టీ మారాలనుకున్న అసలు అవకాశం లేదు. ఎందుకంటే ఆమె వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఆ రేంజ్ లో దూషించింది. ఇప్పుడు ఇష్టం ఉన్న లేకున్నా వైసీపీలో ఉండాలి తప్ప వేరే పార్టీలో చేర్చుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే రోజా మాత్రం పార్టీ మారేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఏకంగా బిజెపిలో చేరేందుకు రెడీ అవుతున్నారు అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది అన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలియబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: