ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. ఏకధాటి గా ప్రజలంతా కలిసి టీడీపీ కూటమి ని అధికారం లోకి తీసుకువచ్చారు. చంద్రబాబు ను మరోసారి ముఖ్యమంత్రి గా చూడాలనుకున్నారు. వారు అనుకున్నదే చేశారు. అలాంటి చంద్రబాబు మరియు ఇతర క్యాబినెట్ వ్యక్తులంతా ఈరోజు వారి వారి పదవుల్లో కొలువు దీరబోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇదే తరుణం లో చంద్రబాబు కేబినెట్ లో ఉండేటు వంటి మంత్రుల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.
ఈసారి ఇందులో పవన్ కళ్యాణ్ కి ఇచ్చే పదవి పై చాలా ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ కు అతి కీలకమైనటు వంటి హోంశాఖ ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఈయన కు ఇదే శాఖ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉందట. అది పవన్ కళ్యాణ్ కి ఇస్తేనే సమర్థవంతం గా నిర్వర్తించగలరని భావిస్తున్నారట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా ఓపిక తో మరియు ముందస్తు చూపుతూ ఆలోచన చేస్తారు. అలాంటి ఆయన దగ్గర శాంతి భద్రతలను కాపాడే పోలీస్ శాఖ ఉంటే రాష్ట్రమంతా చాలా స్వేచ్ఛ గా శాంతిభద్రత తో ఉంటుందని అంటున్నారట.
ఈ శాఖ ద్వారా అల్లర్లు, గ్రూపు రాజకీయాలు లేకుండా పవన్ కళ్యాణ్ చేయగలరని, ఆ సత్తా పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందనే ఆలోచన చేస్తున్నారట. జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. గెలిచినంత మాత్రాన ప్రత్యర్థుల పై రివేంజ్ తీర్చుకునే రాజకీయాలు మేము చేయమని ప్రజా పాలన పై మాత్రమే దృష్టి సారిస్తామన్నారు. అలాంటి ఈ వ్యక్తి కి హోంశాఖ ఇస్తే బాగుంటుందనే ఆలోచనతోనే ఈ శాఖ కట్టబెడుతున్నారని తెలుస్తోంది.మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఈ శాఖలో ఎంత సమర్ధవంతంగా పనిచేస్తారా లేదంటే తన పవర్ చూపిస్తారా.. లేదంటే టిడిపి వాళ్లు రివెంజ్ తీర్చుకునే దానికి సహకరిస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.