మంత్రివర్గ విస్తరణపై.. బాబు ఫార్ములా ఇదేనట?

praveen
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమం లోనే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అంత సిద్ధమైంది. ఎంతోమంది అతిరథ మహారధుల మధ్య ఈ కార్యక్రమం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాబోతున్నారు.

 అయితే ఇలా 2019లో ఓడిపోయి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవడం.. ఇక ఆ తర్వాత 2024 లో అఖండ విజయాన్ని సాధించి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధం అవ్వడంతో తెలుగు తమ్ముళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత ఇక మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. దీంతో కూటమిలో మూడు పార్టీలు ఉన్న నేపథ్యం లో ఎవరికీ ఎన్ని మంత్రి పదవులు తగ్గబోతున్నాయి అనే విషయం పై ఆసక్తికర చర్చ జరుగుతుంది అని చెప్పాలి. కాగా మంత్రివర్గ విభజనపై చంద్రబాబు ఫార్ములా ఇదే అంటూ నిపుణులు ఓ అంచనా వేస్తున్నారు.

 చంద్రబాబు క్యాబినెట్ లో 26 మంది మంత్రులు ఉండ బోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టిడిపి నుండి మరో 18 మందికి మినిస్ట్రీ దక్కబోతుందట. జనసేన నుండి డిప్యూటీ సీఎం ఎంపికైన పవన్ కళ్యాణ్ కాకుండా మరో ముగ్గురికి మినిస్ట్రీ దక్కబోతుందట. బిజెపికి రెండు మంత్రి పదవులను కట్టబెట్ట బోతున్నారట సీఎం చంద్రబాబు. ఇలా మొత్తంగా 26 మంత్రి పదవులను మూడు పార్టీలకు పంచ బోతున్నారు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: