మోడీకి జగన్ మద్దతు.... చంద్రబాబుకు షాక్ తప్పదా ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వైసీపీ పార్టీ... ఈ ఎన్నికలు వచ్చేసరికి బొక్క బోర్ల పడింది. 90 నుంచి 101 సీట్లు సీట్లు వస్తాయని చాలా సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. కానీ వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అటు వైసిపి పార్టీ ఎంపీలు నలుగురు గెలిచారు.

 
 ఇక మిగతా ఎంపీలందరూ ఓడిపోయారు. ఇందులో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ సతీమణి, ఇలాంటి కీలక లీడర్లు ఉన్నారు. అయితే...  ఈసారి అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో... తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేశాయి.  దీంతో బలమైన వైసీపీ పార్టీని సులభంగా ఓడించగలిగాయి ఈ మూడు పార్టీలు. అంతేకాదు కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి రావడంతో....  తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యారు.

 
 అంటే కేంద్రంలో... మోడీ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూడా  అండగా నిలిచింది. కానీ వైసీపీ పార్టీ కూడా... కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి... సపోర్ట్ చేయబోతుందని సమాచారం అందుతుంది. 2019 నుంచి 2024 వరకు... కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి వైసీపీ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేసులు తదితర వ్యవహారాల నేపథ్యంలో... బిజెపి పార్టీకి జగన్ సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా.. మోడీ సర్కార్ కు అనుకూలంగా ఉండేందుకే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడని సమాచారం అందుతోంది.


 ఈ మేరకు మోడీ ప్రధాని అయ్యాక... శుభాకాంక్షలు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆయన ప్రధానిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ పోస్టులో తెలిపారు. దీంతో తన ఎంపీలు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా చెప్పారని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ మోడీకి సపోర్ట్ చేయకపోతే... వైసిపి పార్టీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మొదటి నుంచే ప్రధాని నరేంద్ర మోడీకి... అనుకూలంగా ఉండేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: